Site icon HashtagU Telugu

Basil Seeds: సబ్జా గింజలతో ఇలా చేస్తే చాలు.. మీ చర్మం మెరిసిపోవాల్సిందే?

Mixcollage 01 Dec 2023 05 24 Pm 9920

Mixcollage 01 Dec 2023 05 24 Pm 9920

​సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. సబ్జా గింజల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో విటమిన్‌ ఎ, ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి తరచూ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీవక్రియలను మెరుగుపరుస్తాయి. బరువును కంట్రోల్‌ లో ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వీటిలోని ఫైబర్‌ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

సబ్జా గింజలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, సౌందర్యాన్ని సంరక్షించడానికీ తోడ్పడతాయి. మరి సబ్జా గింజలతో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం…సబ్జా గింజల్లో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కాంతివంతంగా మారుస్తుంది. అలాగే సబ్జా గింజలు స్కిన్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి, ఇన్ఫెక్షన్లను తర్వగా నయం చేస్తాయి. సబ్జా గింజల్లోని యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్ గుణాలు స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ కలిగించే బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. సబ్జా గింజల్లోని న్యాచురల్‌ డీటాక్స్‌ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయి.

కాలుష్యం ప్రభావాన్ని తగ్గించడానికి చర్మాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేస్తాయి. దీనివల్ల సౌందర్య సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే ముడతలను తొలగించడానికి సబ్జా గింజలు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. వీటితో తయారుచేసిన ఫేస్‌ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలపాలి. దీన్ని ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Exit mobile version