Site icon HashtagU Telugu

Guava for Beauty: జామపండుతో మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండిలా?

Mixcollage 29 Jan 2024 04 46 Pm 502

Mixcollage 29 Jan 2024 04 46 Pm 502

జామ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ జామ పండును తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జామ పండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తరచూ జామపండు తీసుకోవడం వల్ల వృద్ధాప్యచాయలు త్వరగా రావు. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు జామ పండుతో కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తే మెడిసి చర్మం మీ సొంతం అవుతుంది. జామపండులోని యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు, గీతలు పడకుండా నివారిస్తాయి.

ముడతలు తొలగించాలంటే ఇందుకోసం ఒక జామ పండు, రెండు జామ ఆకులు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్‌లో ఒక గుడ్డు లేదా అందులోని తెల్ల సొనను తీసుకొని బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన తర్వాత వాసన రాకుండా అందులో ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో జామకాయ మిశ్రమాన్ని కూడా వేసి మిక్స్‌ చేయాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని పావుగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా తరచూ చేస్తే ముడతలు మాయం అవుతాయి.​ జామపండు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. జామపండులో 81శాతం నీరు ఉంటుంది. జామపండు తినడం వల్ల శరీరంలోకి నీరు నెమ్మదిగా విడుదలవుతుంది, ఇది చర్మ కణాలను తేమనందిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి జామ పండు ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించవచ్చు.

దీనికోసం అరకప్పు క్యారట్ ముక్కలు, ఒక జామ పండు తీసుకొని రెండూ కలిపి మిక్సీ పట్టుకోవాలి. కావాలి అనుకుంటే నీళ్లు యాడ్‌ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా తరచూ చేస్తే మృదువైన చర్మం పొందవచ్చు, ముఖంపై మచ్చలు కూడా మాయం అవుతాయి. జామకాయ చర్మ ఛాయను మెరుగుపరచడానికీ సహాయపడుతుంది. పండిన జామను మెత్తని గుజ్జుగా చేసి, గుడ్డు పచ్చసొనను యాడ్‌ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌గా వేసుకోండి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ చర్మ ఛాయ మెరుగుపడుతుంది.​ అదేవిధంగా జామపండును పాలతో కలిపి ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగిస్తే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక జామ పండును తీసుకొని గింజలు తొలగించి పెట్టుకోవాలి. దీంతో పాటు మరో రెండు జామ ఆకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల పాలు కూడా చేర్చి మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పేస్ట్‌లో అర టీస్పూన్ పాల పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్త్లె చేసుకోవాలి. ఓ పావుగంట పాటు అలాగే ఉంచుకొని కడిగేస్తే సరి. ఈ ప్యాక్‌ని తరచూ అప్లై చేస్తే ప్రకాశవంతమైన చర్మం పొందవచ్చు.

Exit mobile version