Black Hair: తెల్లజుట్టు నల్లబడాలంటే కరివేపాకుతో ఇలా చేయాల్సిందే?

ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసు నుంచే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ తెల్ల జుట్టు సమస్య ప్రతి ఒక్కరిని

Published By: HashtagU Telugu Desk
Black Hair

Black Hair

ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసు నుంచే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ తెల్ల జుట్టు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. తెల్ల జుట్టు కారణంగా చిన్న వయసులోనే ఏజ్ బార్ పర్సన్ లా కనిపిస్తూ ఉంటారు. దీంతో చాలా మంది చిన్న వయసులోనే హెయిర్ కి కలర్ వేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని ఉపయోగించగా ఇంకొంతమంది మాత్రం హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ తెల్లజుట్టు కారణంగా నలుగురిలోకి వెళ్ళాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే తెల్లజుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంత మందికి మాత్రం విటమిన్ బీ12, విటమిన్ డీ, కాపర్, ఐరన్ లోపం వల్ల ఏర్పడుతుంది. ఒత్తిడి వల్ల కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. అయితే అటువంటి కొన్ని హోమ్ రెమెడీస్ తెల్ల జుట్టు సమస్యకి చెక్ పెట్టవచ్చు.

ఇందుకోసం కరివేపాకు హెయిర్ మాస్క్. ఈ మాస్క్ జుట్టు కుదుళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ని అందిస్తుంది. అందు వల్ల జుట్టు తెల్లబడడం ఆగిపోతుంది, తరవాత వచ్చే జుట్టు ఆరోగ్యకరం గా పెరుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ రెగ్యులర్ గా ఉపయోగించాలి. ఈ మాస్క్ కోసం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, పన్నెండు కరివేపాకులు తీసుకొని,ముందుగా కొబ్బరి నూనెని వేడిచేసి గోరు వెచ్చ కంటే ఇంకొంచెం వేడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి అందులో కరివేపాకులు వేయాలి. తర్వాత 20 పాటు అలాగే వదిలేయాలి. వేడి కొబ్బరి నూనె లోకి కరివేపాకు లో ఉన్న పోషకాలనీ వెళ్తాయి.

ఇరవై నిమిషాల తరువాత కొబ్బరి నూనె చల్లారి ఉంటుంది కానీ, కొద్దిగా వెచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఈ నూనెని జుట్టు కుదుళ్ళ నించీ కొన వరకూ, స్కాల్ప్ అంతా పట్టించి, బాగా మసాజ్ చెయ్యాలి. అలా కనీసం రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. రాత్రంతా అలాగే వదిలేసిన పరవాలేదు. మైల్డ్ షాంపూతో తల స్నానం చెయ్యాలి. అయితే కండిషనర్ వాడడం మర్చిపోవద్దు. చివర్లో నాలుగు చుక్కల విటమిన్ ఈ ఆయిల్ కూడా నీటిలో కలుపుకోవచ్చు. దీని వల్ల జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

  Last Updated: 22 Aug 2023, 09:10 PM IST