ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో అయితే చిన్న వయసు పిల్లలకు కూడా తెల్లజుట్టు సమస్య వేదిస్తోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వల్ల మనం వయసు కంటే పెద్దగా కనబడుతున్నామో అన్న ధ్యాస ఎక్కువగా ఉంటుంది. దీంతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల హెయిర్ కలర్స్ వినియోగిస్తున్నప్పటికీ అది కొద్దిరోజుల వరకు మాత్రమే ఉంటుంది. పెద్దవారు మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ ని వినియోగిస్తున్నారు. ఆ హెయిర్ కలర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఇంట్లో హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు.
అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కా కూడా ఒకటి. జుట్టు తెల్లబడడం అన్నది జీన్స్ లో ఉంటుంది. కొంత మందికి మాత్రం విటమిన్ బీ12, విటమిన్ డీ, కాపర్, ఐరన్ లోపం వల్ల ఏర్పడుతుంది. ఒత్తిడి వల్ల కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. నల్లగా మార్చడంలో కరివేపాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి కరివేపాకును ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, పది పన్నెండు కరివేపాకులు తీసుకోవాలి. తరువాత కొబ్బరి నూనెని వెచ్చబెట్టి, గోరువెచ్చ కంటే ఇంకొంచెం వేడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. కరివేపాకులు నూనెలో వెయ్యండి. ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలెయ్యండి. వేడి కొబ్బరి నూనె లోకి కరివేపాకులు వేయడం వల్ల అందులో ఉన్న పోషకాలనీ వెళ్తాయి. ఇరవై నిమిషాల తరువాత కొబ్బరి నూనె చల్లారి ఉంటుంది కానీ, కొద్దిగా వెచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఈ నూనెని జుట్టు కుదుళ్ళ నించీ కొనవరకూ, స్కాల్ప్ అంతా పట్టించి బాగా మసాజ్ చెయ్యాలి. కనీసం రెండు గంటలు అలా ఉంచండి. రాత్రంతా వదిలేసిన పరవాలేదు.తరువాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. కండిషనర్ వాడడం మర్చిపోవద్దు. చివర్లో నాలుగు చుక్కల విటమిన్ ఈ ఆయిల్ కూడా నీటిలో కలుపుకోవచ్చు. దీని వల్ల జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది.