Site icon HashtagU Telugu

Aloo Bonda: చలికాలం వేడివేడిగా ఏదైనా తినాలని ఉందా.. అయితే ఆలు బోండాలు ట్రై చేయాల్సిందే?

Mixcollage 20 Dec 2023 04 07 Pm 5493

Mixcollage 20 Dec 2023 04 07 Pm 5493

మామూలుగా మనం ఆలూ తో ఎన్నో రకాల వంటకాలు తిని ఉంటాం. ఆలూ కర్రీ, ఆలూ మసాలా కర్రీ, ఆలూ వేపుడు, ఆలూ బిర్యానీ,ఆలూ చిప్స్, ఆలూ వడలు వేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడు అయినా ఆలు బోండాలు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ చలికాలంలో వేడివేడిగా ఈ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆలు బోండాకు కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన ఆలు – 3
పచ్చిమిర్చి – 3
అల్లం – కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు – 4
ధనియాలు – అర టీ స్పూన్
నూనె – ఒకటిన్నర టీ స్పూన్
ఆవాలు – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
ఇంగువ – పావు టీస్పూన్
ఉల్లిపాయ – 1
పసుపు – పావు టీ స్పూన్
కారం – అర టీస్పూన్
ఇమ్ చూర్ పొడి – అర టీ స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
కొత్తిమీర – కొద్దిగా
నిమ్మరసం – అరచెక్క
శనగ పిండి- 1 కప్పు
బియ్యం పిండి – పావు కప్పు
ఉప్పు – తగినంత
పసుపు – పావు టీ స్పూన్
కారం – పావు టీ స్పూన్
వాము – అర టీ స్పూన్
నీళ్లు – తగినన్ని

ఆలు బోండా తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోని ఇందులో బియ్యంపిండి, ఉప్పు, పసుపు, కారం, వాము వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు కలపాలి. పిండి మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండాలి. తర్వాత దీనిపై మూతపెట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఆలూ స్టఫింగ్ కోసం ఉడకపెట్టిన ఆలును మెత్తగా చేసుకుని జార్ లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత బాణాలిలో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. పచ్చిమిర్చి మిశ్రమం వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఆమ్ చూర్ పొడి, ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన ఆలు వేసి తడిపోయే వరకు వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆలూ మిశ్రమం చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోని నూనె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని ముందుగా కలిపి పిండిలో వేయాలి. తర్వాత ఆలు ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకుని మీడియం మంటపై ఎర్రగా అయ్యేవరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుంటే చాలు ఆలు బోండా రెడీ..

Exit mobile version