Site icon HashtagU Telugu

Aloo Batani Pulao: ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బఠానీ పులావ్ తయారు చేసుకోండిలా?

Aloo Batani Pulao

Aloo Batani Pulao

మాములుగా మనం ఆలూతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటాం. ఆలూ కర్రీ, ఆలూ వేపుడు, ఆలూ కట్లెట్ లాంటి రకరకాల వంటలు తిని ఉంటాం. అయితే ఎప్పుడైనా ఆలూ బఠానీ పులావ్ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఆలూ బటానీ పులావ్ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆలూ బటానీ పులావ్ కి కావాల్సిన పదార్ధాలు:

నూనె – రెండు టేబుల్ స్పూన్స్
ఆలూ – ఒకటి
బటానీ – అర కప్పు
బిరియానీ ఆకు – ఒకటి
లవంగాలు – నాలుగు
యాలకులు – అయిదు
షాహీ జీరా – అర టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
అల్లం వెల్లులి – అర టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – రెండు
బాస్మతి బియ్యం – ఒక కప్పు
పుదీనా తరుగు – కొద్దిగా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నీళ్ళు – 1.1/4 కప్పు

ఆలూ బటానీ పులావ్ తయారీ విధానం:

ఇందుకోసం నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు , యాలకులు, లవంగాలు, షాహీజీరా, వేసి వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకుని అందులోనే ఆలూ ముక్కలు కూడా వేసి ఇవి కూడా లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి. ఆలూ వేగిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపాలి. తర్వాత ఎసరు నీళ్ళు పోసి అందులో పచ్చిమిర్చి, ఉప్పు, బటానీ వేసి హై ఫ్లేమ్ మీద ఎసరు మరగనివ్వాలి. మరుగుతున్న ఎసరులోకడిగి నానబెట్టిన బాస్మతి బియ్యం కొత్తిమీర పుదీనా వేసి కలిపి మూత పెట్టి 1 విసిల్ రానిచ్చి స్టవ్ ఆపాలి. స్టవ్ ఆపిన వెంటనే దింపకుండా కుక్కర్‌ లో ఆవిరి పోయేదాక ఉంచి తర్వాత కుక్కర్ మూత తీసి రైతా లేదా స్పైసీ పనీర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.