Aloe Vera For Beauty: వామ్మో.. కలబంద వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎం

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 10:00 PM IST

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మ సంబంధించిన సమస్యలకు కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబంద అనే చర్మ సమస్యలను పరిష్కరించడానికి, మీ అందం రెట్టింపు చేయడానికి సహాయపడుతుంది. మరి చర్మ సౌందర్యానికి కలబందను ఎలా ఉపయోగించాలి అన్న విషయానికొస్తే.. ముఖం మరింత కాంతివంతంగా ఉండాలంటే కలబంద సహాయపడుతుంది. చిటికెడు పసుపు, ఒక చెంచా పాలు, కొంచెం రోజ్‌వాటర్, చెంచా తేనె వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి కలబంద గుజ్జును జోడించి బాగా మిక్స్‌ చేసుకోవాలి.

దీన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మతత్వం పొడిగా ఉండే వారికి ఎప్పుడు చూసినా ముఖం డల్‌గా కనిపిస్తుంది. తేమ శాతాన్ని పెంచుకోవాలంటే కొద్దిగా కలబంద గుజ్జులో కాస్త ఆలివ్ ఆయిల్‌ని వేసి మెత్తటి పేస్ట్‌లాగా కలుపుకోవాలి. తర్వాత ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ చర్మానికి తేమ అందుతుంది. కలబంద చర్మానికి తేమను అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. టేబుల్‌స్పూన్‌ కలబంద గుజ్జులో, రెండు టేబుల్‌స్పూన్ల వెన్న, చిటికెడు పసుపు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.

ఇప్పుడు దీన్ని ముఖం, మెడపై అప్లై చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి..ఈ ప్యాక్‌ వారానికి రెండు సార్లు చేస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. చర్మంపై ఎండ పడి ట్యాన్ సమస్య రావడం సర్వసాధారణం. కాస్త కలబంద గుజ్జు తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉండే ప్రదేశంలో రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్ మాత్రమే కాదు మొటిమలు కూడా తగ్గిపోతాయి. మూడు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జుకు రెండు టేబుల్‌స్పూన్ల పసుపు, రెండు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్ శెనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల పాటు ఉంచి ఆపై గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చూస్తే చాలు ముఖంపై మొటిమలు మాయం అవడం ఖాయం.