Site icon HashtagU Telugu

Alovera: మొటిమలు జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా.. అయితే కలబందతో ఈ విధంగా చేయాల్సిందే!

Alovera

Alovera

మామూలుగా స్త్రీలు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మళ్లీ యధావిధిగా నేచురల్ పద్ధతిలోనే ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రోడక్ట్లకు బదులుగా న్యాచురల్ పద్ధతిలో కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అయితే మొటిమలు వాటి తాలూకా మచ్చలు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకు కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఇంతకీ కలబందతో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

చిటికెడు పసుపు,ఒక చెంచా పాలు, తేనె,కొంచెం రోజు వాటర్ వీటన్నింటినీ బాగా కలుపుకొని ఇందులో కలబంద గుజ్జుని కలిపి ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుందట. జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారు, మొటిమల సమస్యతో బాధపడుతున్న వారు కలబందను నీళ్లలో కాసేపు మరిగించి దానిని పేస్టులాగా చేసుకోవాలట. తర్వాత దానికి కొన్ని చుక్కల తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలట. 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలని ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. గాయం వల్ల ఏర్పడిన మచ్చలు మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగించడంలో కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుందట.

ఇందుకోసం కలబంద గుజ్జులో కాస్త రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చల ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని తో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్న వారు కలబంద గుజ్జులో కాస్త ఆలివ్ ఆయిల్ వేసి మెత్తటి పేస్టులా చేసుకుని ఈ మిశ్రమాన్ని మెడజకు, ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయట.