Aloevera: వేసవిలో కలబందను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఇవే?

  • Written By:
  • Updated On - February 24, 2024 / 09:41 PM IST

కలబంద వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబందను ఉపయోగించి ఎన్నో రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా వేసవిలో వచ్చే రకరకాల చర్మ సమస్యలను తొలగించుకోవచ్చు. మరి వేసవిలో కలబందను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలబందని క్రీములు, షాంపూలు, సబ్బులు మొదలైన వాటిలో ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే కెమికల్ కలిగిన ఆ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం కంటే మనం సాధారణంగా దొరికే మొక్క నుంచి తీసుకుని ఉపయోగిస్తే మరింత మేలు కలుగుతుంది. అలోవెరాని ఉపయోగించడం వల్ల మనకి స్కిన్ హైడ్రేషన్ గా ఉంటుంది.

సాధారణంగా మనం రోజూ నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటాం. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే చాలు తిండి మాట పక్కన పెట్టి నీళ్లు తాగుతూ ఉంటాము. అలాగే చర్మం కూడా హైడ్రేట్ గా ఉండాలి. దీని కోసం పెద్దగా శ్రమించక్కర్లేదు. చర్మం పొడిబారిపోయి డ్రై ఉన్నట్టయితే ఈ చిట్కాలు పాటించాలి. దీని వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండడానికి సహాయపడుతుంది. ఎక్కువగా చెమట పట్టడం వలన ఒంట్లోని నీరు తగ్గిపోతుంది. పొడిబారిపోయిన చర్మం ఉంటే కనుక అలోవెరాని మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం మంచిది. దీనివల్ల చర్మం డ్రై అయి పోకుండా హైడ్రేట్ గా ఉంటుంది. లేదు అంటే మీరు అలోవెరా క్రీమ్ ని కూడా ఉపయోగించొచ్చు. అలోవెరాని తీసుకుని అప్లై చేయడం వల్ల కూడా మీ స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది.

సమ్మర్ లో కూడా మీకు ఇది మీ స్కిన్ ని బాగా ఉంచుతుంది. కాబట్టి మీరు వీటిని ఉపయోగించడం మర్చిపోకండి. దీనితో సమస్య సులువుగా తొలగి పోతుంది. అలోవెరా వల్ల కేవలం డ్రై స్కిన్ ని తగ్గించుకోవడం మాత్రమే కాదు. మంచి రిలీఫ్ కూడా మీకు వెంటనే ఇస్తుంది. ఎప్పుడైనా ఏమైనా స్కిన్ సమస్యలు, దురదలు మంటలు వంటివి కలిగినపుడు మంచి ఉపశమనం మీకు అలోవెరా ఇస్తుంది. అలోవెరా లో చల్లదనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది ఇది మిమ్మల్ని సూతింగ్ చేస్తుంది. మీకు ఇబ్బంది కలిగిన ప్రదేశం లో అలోవెరా జెల్ ను ఉపయోగించారు అంటే తప్పకుండా మీకు వెంటనే రిలీఫ్ ఉంటుంది. మరీ ఎక్కువగా ఉంటే మరింత ఉపశమనం కోసం రాత్రి పూట అలోవెరా జెల్ ని రాసి ఉదయాన్నే చల్లని నీళ్ళ తో కడిగేయాలి. ఇలా చేస్తే మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. మీ చర్మం ఏదైనా సరే ఇది మంచిగా పని చేస్తుంది. నాచురల్ పదార్థం అయిన అలోవేరా ఏ చర్మం వాళ్లకి అయినా కూడా మంచి బెనిఫిట్స్ ని ఇస్తుంది. వేసవి లో ఎక్కువగా బర్నింగ్ వంటివి ఉంటాయి. అలాగే చర్మం పొడిబారిపోవడం లేదా చర్మం పై దురదలు రావడం వంటివి సాధారణమే. చాలా మంది ఈ సమస్య తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు అలోవెరాని కనుక ఉపయోగించారు అంటే తప్పకుండా మంచి ఉపశమనం లభిస్తుంది. పైగా సమస్య కూడా ఉండదు. వేసవి లో ఎప్పుడైనా ఈ సమస్యలు కలిగాయి అంటే అలోవెరాని ఉపయోగించండి.