Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే?

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా మెరిసే చర్మం అలాగే ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో వంటింటి చిట్కాలను ఉపయోగించడం

  • Written By:
  • Publish Date - December 17, 2023 / 09:45 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా మెరిసే చర్మం అలాగే ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో వంటింటి చిట్కాలను ఉపయోగించడంతోపాటు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితాలు లభించ లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, దుమ్ము,దూళి ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలామంది చర్మం అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆ కారణాల వల్ల చర్మం, జుట్టు నిస్తేజంగా, నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యలకు చెక్‌ పెట్టి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి బాదం నూనె సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.

మరి బాదం నూనెతో జుట్టు చర్మ సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చర్మంపై అప్లై చేసుకోవడానికి స్వీట్‌ బాదం నూనె మాత్రమే వాడాలి. స్వీట్‌ బాదం నూనెలో హైపో అలెర్జెనిక్ గుణాలు ఉంటాయి. బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది స్కిన్‌ ఇన్ఫ్లమేషన్‌, వాపు, చికాకు, దురద వంటి చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే చర్మానికి రోజూ బాదం నూనె అప్లై చేసుకోవడం వల్ల ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందవచ్చు. దీనిలో మెండుగా ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. దీన్ని తరచూ చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం ఛాయ కూడా మెరుగుపడుతుంది.

చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ఇబ్బంది పెట్టే వారికి బాదం నూనె మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. దీన్ని తరచూ రాసుకోవడం వల్ల ముడతలు కూడా మాయమవుతాయి. ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య డార్క్‌ సర్కిల్స్‌. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల కింద అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే డార్క్‌ సర్కిల్స్‌ తగ్గుతాయి.,కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. మీ చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుకోవాలంటే రెండు చెంచాల పెసరపిండిలో సరిపడా బాదం నూనె కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని చర్మానికి నలుగులా రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా మారుతుంది. సూర్య కిరణాలు, కాలుష్యం కారణంగా జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు కొందరిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు బాదం నూనె, ఆముదం, ఆలివ్‌ నూనెల్ని సమ భాగాలుగా తీసుకొని మిక్స్‌ చేయండి. ఈ నూనెతో కుదుళ్లను మర్దన చేసుకోవాలి. ఇలా కనీసం వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. బాదం నూనె హెయిర్‌ గ్రోత్‌కు అద్భుతంగా పని చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా కేశాలకు కాంతిని అందిస్తుంది. మృదువుగా మారుస్తుంది. వారానికి కనీసం రెండు సార్లు ఈ నూనెతో తల మర్దన చేసుకుని తలస్నానం చేస్తే ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చు.