Gold Rate : భారీగా పతనమైన బంగారం ధర…వెండి ధర ఢమాల్…!!

మహిళలకు ఇది శుభవార్త లాంటిదే.!! ఎందుకంటే ఎప్పటినుంచో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనుకునే వారికి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు!!

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 08:00 AM IST

మహిళలకు ఇది శుభవార్త లాంటిదే.!! ఎందుకంటే ఎప్పటినుంచో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనుకునే వారికి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు!!. ఎందుకంటే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి.!! గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఇంకా దిగువునే ఉన్నాయి…!! వెండి ధరలు కూడా ఢమాల్ అన్నాయి..!!

ఆల్ టైం గరిష్టం నుంచి చూస్తే బంగారం ధర రూ. 6,600వరకు తగ్గింది. బంగారం ధర పదిగ్రాములకు ఇప్పుడు రూ. 56, 250గా ఉంది. ఇప్పుడున్న రేటుతో పోల్చితే బంగారం ఇంకా తక్కువ ధరకే లభిస్తోందని చెప్పవచ్చు. అలాగే వెండికూడా పదిగ్రాములు 76వేలు. ప్రస్తుత రేటుతో పోల్చితే…వెండి రేటు 19వేలకు పైగా పడిపోయింది. వెండి కొనాలనుకునేవారికి ఇది ఊరటనిచ్చే వార్త. ప్రస్తుతం వెండి ధర 57వేలుగా ఉంది.

కాగా దేశీయ మార్కెట్లో ఇవాళ్టి బంగారం ధరలు పది గ్రాములకు రూ. 49,570లుగా ఉంది. ఇది 24 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,410 వద్ద ట్రేడ్ అవుతోంది. 18క్యారెట్ల బంగారం ధర రూ. 37180 ఉండగా 14 క్యారెట్ల బంగారం ధర రూ. 29,000గా ఉంది. ఇక వీటన్నింటికి GST ధరలు అదనంగా ఉంటాయి. అంతేకాదు మేకింగ్ ఛార్జీలు కూడా అదనంగానే ఉంటాయి. అందుకే మార్కెట్లో బంగారం ధరల్లో కొంత వ్యత్యాసం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

మార్కెట్లో ప్రస్తుతం ధరలపై తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లోని బంగారం ధరపై పడుతోందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు అమెరికా ఫెడరల్ రిజర్వు కీలకమైన ఫెడ్ రేటును 100బేసిస్ పాయింట్ల వరకు పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అమెరికా ఫెడ్ రేటు పైకి వెళ్తే..బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు ప్రస్తుతం బంగారం ధరపై ఒత్తిడి నెలకొందంటున్నారు.