సాధారణంగా రోజుకు ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి ఇలా మూడు పూటలా,మూడుసార్లు తింటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం నాలుగు సార్లు తింటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే రోజుకు నాలుగు సార్లు మించి కూడా తింటూ ఉంటారు. అటువంటి వారికి ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. ఇది ఇలా నాలుగు ఐదు సార్లు తింటున్నప్పుడు ఇంట్లోని పెద్దలు తిడుతూ ఉంటారు. అలా నాలుగు ఐదు సార్లు తినే కంటె ఒకసారి తినవచ్చు కదా అని మందలిస్తూ ఉంటారు. అయితే చాలామందికి రోజుకు ఎన్నిసార్లు తినాలి. ఎన్నిసార్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అన్న విషయం పట్ల అనేక సందేహాలు ఉంటాయి..
మరి ఈ విషయం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజుకి నాలుగు లేదా ఐదు సార్లు భోజనం చేయడం వల్ల ఆ పరిమాణం చాలా తక్కువగా ఉండటంతో పాటు అది వారి ఆకలిని 50 నుండి 80 శాతం వరకు తీరుస్తుంది. మీరు ఎక్టోమోర్ప్ శరీర రకం అంటే ఆకలి వేయకుండా సన్నగా ఉన్నవారు, లేదా మెసోమార్ఫ్ అంటే ఆకలి ఎక్కువగా ఎక్కుగా ఉండేవారు అయితే, ప్రతిరోజు ఆహారాన్ని నాలుగు సార్లు తినడం మంచిది. అయితే కేవలం ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలిగా ఉన్నప్పుడు మొత్తం అంటే ఫుల్ గా తినకుండా 80% మాత్రమే తినాలి. అదేవిధంగా సూర్యాస్తమయం తరువాత ఎక్కువగా తినకూడదు.
అలాగే పడుకునే ముందు రెండు లేదా మూడు గంటల ముందే డిన్నర్ చేసి పడుకోవాలి. ఆ తర్వాత కూడా ఒకవేళ పడుకునే ముందు ఆకలిగా అనిపిస్తే అటువంటి సమయంలో ప్లాంట్ బేస్డ్ మిల్క్ లేదంటే నార్మల్ మిల్క్ ని చిటికెడు పసుపు లేదా జాజికాయ పొడిని కలిపి తీసుకోవచ్చు. ఇలా తాగడం వల్ల నీకు ఆకలిగా అనిపించదు. అలాగే మీరు ప్రతిరోజు నాలుగు సార్లు తినడం వల్ల మధ్యలో స్నాక్స్ తినాలి అని కూడా అనిపించదు. కాబట్టి ప్రతిరోజు నాలుగు సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు నిపుణులు. అలాగే రోజుకి మూడుసార్లు కూడా భోజనం చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. లైట్ గా బ్రేక్ ఫాస్ట్, లంచ్, సూర్యాస్తమయం తర్వాత డిన్నర్ చేయడం మంచిది అని చెబుతున్నారు.