Father’s Day : జీవితంలో ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోయినా సరే…గుర్తుకు వచ్చేది నాన్న..!!

తల్లి అంటే ఎంత ప్రేమో...తండ్రి అంటే కూడా అంతే ప్రేమ ఉంటుంది. నాన్న గంభీరంగా ఉంటారు. అందుకే నాన్నకు భయపడతారు. ఏదైనా నాన్నకు ఇబ్బంది వాటిల్లితే మాత్రం ఒక సెకను కూడా ఆగరు.

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 09:02 AM IST

నువ్వు కోపంగా మాట్లాడుతుంటే
ప్రశాంతతే తెలియదనుకున్నా…
కళ్ళెర్రజేస్తుంటే కాఠిన్య మనస్సు అనుకున్నా…
మౌనంగా నువ్వుంటే మాటలే నీకిష్టంలేదనుకున్నా…
ఆజ్ఝలు వేస్తుంటే బానిసగా బాధపడ్డా…
నాన్నా!!!నాకిప్పుడే తెలుస్తోంది..
వీటన్నిటి వెనక మూలసూత్రం ఒకటుందని..
అదే మా పైన అమిత ప్రేమని…
మా బాగుకోసం…భవితకోసం
ఆరాటం అని

హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా…

తల్లి అంటే ఎంత ప్రేమో…తండ్రి అంటే కూడా అంతే ప్రేమ ఉంటుంది. నాన్న గంభీరంగా ఉంటారు. అందుకే నాన్నకు భయపడతారు. ఏదైనా నాన్నకు ఇబ్బంది వాటిల్లితే మాత్రం ఒక సెకను కూడా ఆగరు. అదే పిల్లలకు, నాన్నకు ఉన్న అనుబంధం. తల్లి జన్మనిస్తే…తండ్రి తన పిల్లల్ని కాపాడటానికి తన పిల్లలు కనే ప్రతి కలను నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు. ఎన్నో త్యాగాలను చేసి పిల్లల మొహంలో సంతోషాన్ని నింపాలనుకుంటాడు.

ఒక తండ్రి తన జీవితమంతా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేందుకు..వారి అవసరాలను తీర్చేందుకు తన జీతాన్ని…జీవితాన్ని వెచ్చిస్తాడు. తండ్రి ప్రేమని త్యాగాన్ని గుర్తిస్తూ…నాన్నకు ఎప్పుడూ క్రుతజ్ణతలు చెప్పము. కనీసం ఒక్కరోజూ రాత్రింబగళ్లు నాన్న కష్టపడే క్రుషి, ప్రేమ. తండ్రి ప్రేమకు ధన్యవాదాలు తెలుతుపుతూ..ఫాదర్స్ డేను జరుపుకుంటారు. ఇది నాన్నను గౌరవించే రోజు. ఈ రోజు మీ తండ్రికి ప్రత్యేక అనుభూతిని ఇచ్చే విధంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి.

తండ్రి గొప్పదనం గురించి తెలుపుతూ.. నాన్నగుర్తింపుకు ఒక రోజు ఉండాలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో అమెరికాలో మొదటిసారి ఫాదర్స్ డే ను నిర్వహించారు.. అనంతరం 1916 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఫాదర్స్ డేని జరుపుకోవాలనే సూచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1966 సంవత్సరంలో, ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ జూన్ 3వ ఆదివారం నాడు ఫాదర్స్ డేని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ఫాధర్స్ డేను జరుపుకుంటున్నారు..

ఆరోజు ప్రత్యేకంగా నాన్నకు దగ్గరుండి, చిన్నప్పటి నుంచి గడిపిన జ్ణాపకాలను గుర్తు తెచ్చుకోవడం, సరదాగా గడపడం అతనికి నచ్చిన విధంగా చెయ్యడం…ఆయన చేసిన త్యాగాలకు ఇది గుర్తు అని మర్చిపోలేని సంతోషాన్ని అందించండి..ఇదే మీరు నాన్నకు ఇచ్చే మరుపురాని బహుమతి…!!!!