Fiber Rich Seeds : ఈ గింజలు అరటీస్పూన్ చాలు..మీ ఎముకలను ఉక్కులా మార్చుతాయి..!!

  • Written By:
  • Publish Date - November 15, 2022 / 10:25 PM IST

ఈమధ్య చాలా మంది ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారు. ఎందుకంటే వయస్సుతో సంబంధం లేకుండా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీనంతటికి కారణం మారుతున్న జీవన విధానమే అన్న ఆలోచన చాలా మందిలో వచ్చింది. అందుకే ఆరోగ్యం పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. జంక్ ఫుడ్ కు స్వస్తి పలికి…ఇంటి ఫుడ్ కు ఓటెస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పోషకాలున్నాయా లేదా అనేదానిపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు.

1. అవిసెగింజలు ఈ పేరు వినే ఉంటారు. ఈ గింజలు మన శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి. ఈ గింజలను వేయించుకుని పొడి చేసుకుని కూరలు, చట్నీల్లో కలుపుకోవచ్చు. లేదంటే ఖర్జూరం తో కలిపి లడ్డూలాగా చేసుకుని తినవచ్చు. కమ్మటి వాసనతోపాటు ఎంతో రుచిగా ఉంటాయి. సాధారణంగా నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. కానీ అందులో కంటే వీటిలో కాల్షియంగా సమృద్దిగా లభిస్తుంది.

2. ఇందులో ఉండే జింక్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఐరన్, కాల్షియం , ఫైబర్ వంటి సమస్యలనుఎదుర్కొంటున్నారు. ఈమూడు పోషకాలు ఈ అవిసె గింజల్లో పుష్కలంగా లబిస్తాయి. ఇందులో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండటంతో ఎదిగే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు విటమిన్ సి కూడా ఉంటుంది.

3. కాల్షియం, విటమిన్ సీ ఉండటం వల్ల ఎముకలకు మరింత బలం చేకూర్చుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు చెక్ పెడుతుంది. ఐరన్ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా చూడటంతోపాటు మలబద్దకం సమస్యను నివారించడంలో బాగా పనిచేస్తుంది.