Site icon HashtagU Telugu

‎Karpooravalli: చలికాలంలో కర్పూరవల్లి తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Karpooravalli

Karpooravalli

‎Karpooravalli: మన ఇంట్లో చాలా రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. ఇళ్లలో, బాల్కనీ కుండీలలో ఎంతో అందంగా, పచ్చగా కనిపించే మొక్క కర్పూరవల్లి కూడా ఒకటి. దీనినే వాము ఆకు లేదా మెక్సికన్ పుదీనా లేదా కప్పరిల్లాకు అంటూ రక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది మంచి వాసనను కలిగి ఉండడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. దీనిని ఉపయోగించి కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. చిన్న కొమ్మ పెట్టిన చాలు వెంటనే ఈ మొక్క బ్రతికేస్తుంది.

‎ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం రాగానే జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కర్పూరవల్లి ఆకులు దివ్యౌషధంలా పనిచేస్తాయట. నాలుగైదు ఆకులను నలిపి, దాని రసాన్ని కొద్దిగా తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందట. ఛాతీలో కఫం పేరుకుపోయి ఇబ్బంది పెడుతుంటే, వేడి నీటిలో కొన్ని కర్పూరవల్లి ఆకులను వేసి, ఆవిరి పడితే శ్వాస తేలికగా ఆడుతుందట. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక వరం లాంటిదని చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు కర్పూరవల్లి అద్భుతంగా సహాయపడుతుందట.

‎ దీని ఆకులతో చేసిన కషాయం లేదా టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుందట. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడటాన్ని నియంత్రించి, తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుందట. క్రమం తప్పకుండా వాడటం వల్ల ఆకలి కూడా పెరుగుతుందని చెబుతున్నారు. కర్పూరవల్లిలో సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఏదైనా గాయం తగిలినా, కీటకాలు కుట్టినా లేదా చర్మంపై దద్దుర్లు వచ్చినా వెంటనే కొన్ని ఆకులను మెత్తగా నూరి ఆ ప్రదేశంలో పట్టుగా వేయడం వల్ల ఇది నొప్పి, వాపును తగ్గించడమే కాకుండా, ఇన్‌ఫెక్షన్ సోకకుండా చర్మాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. ఈ ఆకులు శరీరంలోని రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచి, వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయట. అందుకే దీనిని ఉత్తమ ఇమ్యూనిటీ బూస్టర్‌గా పరిగణిస్తారు. కర్పూరవల్లిలోని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను, ముఖ్యంగా బ్రెస్ట్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ను నిరోధించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. రెండు మూడు ఆకులను నలిపి రసం తీసి, కొద్దిగా తేనెతో కలిపి తాగవచ్చట. కొన్ని ఆకులను నీటిలో వేసి మరిగించి, వడగట్టి కషాయంలా తాగవచ్చని చెబుతున్నారు. అలాగే రుచి కోసం మిరియాలు, తేనె కలుపుకోవచ్చట.

Exit mobile version