Site icon HashtagU Telugu

9 signs You’re With a Real and Faithful Man : మీరు నమ్మకమైన వ్యక్తితో ఉన్నారని చెప్పే 9 సంకేతాలు ఇవే..!

9 Signs You’re With A Real And Faithful Man

9 Signs You’re With A Real And Faithful Man

9 signs You’re With a Real and Faithful Man భాగస్వామి విషయంలో మహిళలు అందరికీ ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి. పరిపూర్ణమైన వ్యక్తి గురించి వారికంటూ సొంత ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో అమ్మాయిలకు ఉండే రిక్వైర్ మెంట్ లు చాలా ఉంటాయి. సరదాగా గడిపే వ్యక్తి.. శారీరక దృడత్వం, మానసిక పరిస్థితి ఇవన్ని బాగుంటేనే అతన్ని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే నమ్మమైన వ్యక్తి విషయంలో ఒక 9 సంకేతాలు వారి గురించి తెలిసేలా చేస్తాయి.

We’re now on WhatsApp : Click to Join

1. సాన్నిహిత్యం ఆ ఒక్క పని కోసం మాత్రమే కాదు

రిలేషన్ షిప్ లో భార్య భర్తల మధ్య శృంగారం చాలా అవసరం అయితే అది కేవలం ఒక పనిలా కాకుండా ప్రేమని పంచే ప్రక్రియగా చూస్తే బాగుంటుంది. శృంగారం కోసం సమయం వెచ్చించడం దానికి టైం షీట్ ప్లాన్ చేయడం లాంటివి కాకుండా మీతో ఎప్పటికీ సంతోషంగా ఉత్సాహంగా ఉండేలా చూస్తారు. పడక గదిలో పని ఫాస్ట్ గా చేసేయడం అన్నది కాకుండా ప్రేమను పంచుతూ ఆప్యాయతగా ఉండటం తో అతనికి మీ మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో గుర్తించాలి.

2. ఆల్ యాక్సెస్ పాస్ కలిగి ఉండటం

భాగస్వామి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండగలగాలి. వారి పర్మిషన్ లేకుండానే వారు ఉంటున్న రూం లేదా అపార్ట్ మెంట్ లో ఏదైనా పని కోసం వెళ్లేంత నమ్మకం ఉంటే మీ పట్ల వారి విధేయత కచ్చితమా ఉందని గుర్తించవచ్చు.

3. తరచుగా కాల్స్ చేయడం

రోజంతా పనిలో ఉన్నా సరే రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీ గురించి ఆలోచించి ఒక కాల్ లేదా మెసేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా మీ కోసం ఆలోచించగలగడం కూడా మీ మీద అతనికి ఉన్న ప్రేమని తెలియచేస్తుంది.

4. దృష్టి అంతా మీ మీదే

రిలేషన్ షిప్ లో ఒక వ్యక్తి తమ ఆలోచన అంతా మీ మీదే ఉంచితే అది మంచి విషయమని చెప్పొచ్చు. ఇతరుల గురించి ముఖ్యంగా వేరే అమ్మాయిల గురించి ఆలోచించకుండా మీ మీదనే ఎప్పుడు దృష్టి పెడుతూ ఉంటాడు. మీరు చెబుతున్న ప్రతి విషయం మీద ఫోకస్ గా ఉంటాడు. అలా చేస్తే అతను నిజమని మీరు కచ్చితమా భావిస్తారు.

Aslo Read 6 Signs You Are Not A Couple : ఇలా కలిసి ఉన్నా మీరు వేరుగా ఉన్నట్టే..!

5. స్నేహితులతో పంచుకోవడం

మీరు ఏదైనా ఒక పార్టీలో అతని స్నేహితులతో తనని చూసినప్పుడు అతను భయపడాల్సిన అవసరం లేదు. తన ఫ్రెండ్స్ కి మీ రిలేషన్ గురించి చెప్పడంలో వెనుకాడడు. అతని ముఖ్యమైన వ్యక్తులతో అయినా అతను మీ గురిచి తెలియచేసి ఉంటాడు.

6. ఏం చేయడానికైనా వెనుకాడడు

రిలేషన్ షిప్ లో ఉన్న స్ట్రాంగ్ నెస్ వల్ల మీ కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. మీకు అనుకూలంగా ఉండేందుకు తను ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొంటాడు. అంతేకాదు మీ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు.

7. ప్రతి విషయంలో ఆసక్తి

మీరు చేసే లేదా కలుగచేసుకునే ఏ విషయం గురించి అయినా అతను ఆసక్తి చూపిస్తాడు. మీ ఇష్టాలపైన ఆసక్తి చూపిస్తాడు. మీ అందమైన ఆలోచనలు వాటి లోతైన చీకటి విషయాలను కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు.

8. ఏది దాచుకోవడం జరగదు

అతని ఫోన్ లో పాస్ కోడ్ ఉండదు. ఏ కారణం తో అయినా అతని ఫోన్ మీ దగ్గర ఉంచడానికి మరో ఆలోచన చేయడు. అతని సోషల్ మీడియా ఖాతాలు కూడా మీకు పాస్ వర్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై కూడా మీ దగ్గర ఎలాంటి దాపరికం లేకుండా ఉంటాడు.

9. వాటిని పెద్దగా పట్టించుకోడు

అతనికి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారన్నది కానీ మీ ప్లానింగ్ కు రెస్పెక్ట్ ఇస్తాడు. ఒకేరోజు రెండు పార్టీలు ఉన్నప్పుడు మీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తాడు. మీ జీవితంలో జరిగే మంచికి సపోర్ట్ గా బ్యాడ్ టైం లో దాని నుంచి బయట పడేందుకు సహకరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ మీతో ఉంటూ మీ సంతోషాన్ని కోరుకుంటాడు.