Love You : మీ ప్రేయసి/ప్రేమిక మీతో నిజంగానే ప్రేమలో ఉన్నారా ? లేదా ? అనేది చాలాచాలా ముఖ్యమైన అంశం. ప్రేమను వ్యక్తీకరించే విధానాలు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు ప్రేమ బహిర్గతం కావచ్చు.. ఇంకొన్నిసార్లు బహిర్గత కాకపోవచ్చు!! అలా అని అపార్థం చేసుకోకూడదు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని ‘ట్రూ లవ్’ సిగ్నల్స్ గురించి తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join.
1. టైం ఫర్ యూ
ఒక వ్యక్తి మీతో ప్రేమలో ఉంటే.. కచ్చితంగా మీకు సమయాన్ని కేటాయించేందుకు వెనుకాడడు. మీతో సమయం గడపడాన్ని గొప్ప లక్‌గా భావిస్తాడు. ఏదైనా డేట్‌లో ఈవెంట్ కానీ, మీటింగ్ కానీ ప్లాన్ చేసుకుంటే కచ్చితంగా సమయానికి అటెండ్ అవుతాడు. మీతో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాడు. మీ బంధాన్ని బలోపేతం చేసేందుకు ఏమేం చేయాలో అవన్నీ(Love You) చేస్తాడు.
2. వింటాడు.. శ్రద్ధ వహిస్తాడు
నిజంగా ప్రేమలో ఉన్న వ్యక్తి భౌతికంగా మాత్రమే కాదు.. మానసికంగానూ మీతో అటాచ్‌మెంట్‌ను పెంచుకుంటాడు. మీ ఆలోచనలు, భావాలపై ఆసక్తిని కనబరుస్తాడు. మీరు చెప్పేది శ్రద్ధగా వింటాడు. మీ సంతోషాలు, బాధలలో భాగస్వామి అవుతాడు. సంతోషాన్ని సంతోషంగా పంచుకుంటాడు. బాధల సమయంలో భుజం తట్టి ఓదారుస్తాడు. అందుకే నిజమైన ప్రేమికుడిని గుడ్డిగా నమ్మొచ్చు.
3.ఇద్దరి లోకం ఒకటే
నిజమైన ప్రేమలో ఉన్నవారి లోకం ఒకటే.. అదే ప్రేమలోకం. ఇద్దరూ జీవితంలో ఒకటయ్యేందుకు నిరంతరం ప్రయత్నిస్తారు. మీతో నిజమైన ప్రేమలో ఉన్నవాడు.. అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు, ముఖ్యమైన వ్యక్తులను మీకు పరిచయం చేస్తాడు. మిమ్మల్ని వ్యక్తిగతంగా, సామాజికంగా తనలో ఒక భాగమని చెప్పాలనే ప్రయత్నంలో లవర్ ఉన్నాడు అనడానికి ఇది సిగ్నల్. మీతో ప్రేమ సంబంధానికి అతడు టాప్ ప్రయారిటీ ఇస్తాడు.
4. మీ అభిప్రాయాలకు గౌరవం
పరస్పర గౌరవం.. ఇది ప్రేమబంధానికి మూలస్తంభం. ప్రేమలో ఉన్న వ్యక్తి మీ అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువనిస్తారు. మీ ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. వాటిపై ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చిస్తారు. విభేదాలు రాకుండా సామరస్యంగా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని సాధిస్తారు. పరస్పర గౌరవం.. మీ ప్రేమకు బలమైన పునాదిని నిర్మించడంలో సహాయపడుతుంది.
5. ఆకర్షణ తక్కువ ఆప్యాయతే ఎక్కువ
ప్రేమలో అత్యంత ముఖ్యమైన అంశం ఆప్యాయత. ట్రూ లవర్ ప్రేమలో ఆకర్షణ కంటే ఆప్యాయత ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇదే ఉంటే.. అతడు మీకు శారీరకంగా దగ్గరయ్యే ప్రయత్నాలతో పాటు మానసికంగా చేరువయ్యే సంకేతాలు కూడా ఇస్తుంటాడు. పదాలలో చెప్పలేని సన్నిహిత సంబంధాన్ని మీ మధ్య పెంచేందుకు ట్రూ లవర్ ప్రయత్నిస్తాడు. అతడు తన హృదయంలో అనుభూతి చెందుతున్న ప్రేమను సరైన పదాలలో మీకు చెబుతాడు.
6. మీ స్వతంత్రతకు గౌరవం
అతడు ట్రూ లవర్ అయితే.. మీ స్వతంత్ర భావజాలానికి, ఆలోచనలకు కూడా గౌరవం ఇస్తాడు. తన కోసం మీ ఆలోచనలను, ఆశయాలను చంపుకోవాల్సిన అవసరం లేదని చెబుతాడు. మీ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ప్రతిదాన్ని నెగెటివ్‌గా ఆలోచించడు. ట్రూ లవర్ అనేవాడు.. మిమ్మల్ని నియంత్రించడానికి అస్సలు ప్రయత్నించడు. మీ వ్యక్తిత్వానికి విలువ ఇస్తాడు . దీనివల్ల మీరిద్దరూ వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది.
7. మీ కలలకు మద్దతు
ఒక వ్యక్తి నిజంగా మీతో ప్రేమలో ఉంటే.. అతను మీకు పెద్ద ఫ్యాన్ అవుతాడు. మీ కలలు, లక్ష్యాలను కొనసాగించమని ప్రోత్సహిస్తాడు. అతడికి చేతనైనంత మీకు సపోర్ట్ చేస్తాడు. అది వృత్తిపరమైన కదలిక అయినా, వ్యక్తిగత ఆకాంక్ష అయినా, కొత్త అభిరుచి అయినా.. మీ లవర్ మీ పక్షానే నిలుస్తాడు. మిమ్మల్ని గెలిపిస్తాడు. ప్రపంచమంతా వదిలేసినా.. మీ సామర్థ్యాన్ని మీ ట్రూ లవర్ విశ్వసిస్తాడు. మీ విజయాలకు బాటలు వేసే ప్రయత్నం చేస్తాడు.
8. అన్నీ గుర్తుంచుకుంటాడు
ప్రేమ దేశంలో ప్రేమికుల పయనం అద్భుతం. ఇందులోని ప్రతిఘట్టాన్ని ట్రూ లవర్ బాగా గుర్తుంచుకుంటాడు. మీ ఆలోచనలు, మీ హావభావాలు, మీ ఫిలాసఫీ గురించి అతడికి ఒక ఐడియా వస్తుంది. గాఢంగా ప్రేమలో ఉన్న వ్యక్తి మీకు ఇష్టమైన ప్రతీదాన్ని గుర్తుంచుకుంటాడు. మీ ఆనందమే అతడికి టాప్ ప్రయారిటీగా మారుతుంది. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటాడు.