8 Signs : మీ భాగస్వామికి మీరు ఫస్ట్ ప్రయారిటీ కాదు.. 8 రెడ్ సిగ్నల్స్

8 Signs : భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య అన్యోన్యత చాలా ముఖ్యం. మీ భాగస్వామి.. మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారా ? లేదా ?

  • Written By:
  • Updated On - October 30, 2023 / 11:11 AM IST

8 Signs : భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య అన్యోన్యత చాలా ముఖ్యం. మీ భాగస్వామి.. మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకోవడానికి  కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. భాగస్వామి వ్యవహార శైలిని బట్టి, నిర్ణయాలను బట్టి ఈ సిగ్నల్స్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నిబట్టి భాగస్వామి దృష్టిలో మన స్టేటస్ ఏమిటనే దానిపై క్లారిటీ వస్తుంది.  భాగస్వామి వ్యవహార శైలిపై  మనకు క్లారిటీని అందించే 8 కీలకమైన సిగ్నల్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

1.నో టైం 

భాగస్వామి తన రోజువారీ బిజీ షెడ్యూల్‌లో మీ కోసం కొంత టైంను కేటాయించకపోతే.. అది రెడ్ సిగ్నల్.  రోజూ ఇదే రిపీటైతే వెంటనే అలర్ట్ కావాలి. అతని/ఆమె జీవితంలో మీకు ప్రాధాన్యత లేదని దీంతో అర్థం చేసుకోవచ్చు. మీకు నిజంగా విలువనిచ్చే వ్యక్తి.. తన పనులతో సంబంధం లేకుండా మీకు కచ్చితంగా కనీస సమయాన్ని రోజూ కేటాయిస్తాడు.

2.లేట్ రిప్లైస్ 

భాగస్వామి మీ మెసేజ్‌లకు లేట్‌గా రిప్లైస్ ఇస్తే .. అది నెగెటివ్ పాయింట్.  నిత్యం ఇదే జరుగుతుంటే..  మీ మెసేజ్‌లకు ప్రయారిటీ అంతగా ఇవ్వడం లేదని అర్థం చేసుకోవచ్చు. మీకు నిజంగా విలువనిచ్చే వ్యక్తి కచ్చితంగా మెసేజ్‌లకు సత్వరం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు.

3.లాస్ట్ మినట్ ప్లాన్స్

మీ భాగస్వామి అకస్మాత్తుగా, హడావుడిగా, చివరి క్షణంలో టూర్ లేదా షాపింగ్ లేదా బంధువుల ఇళ్లకు వెళ్లడంపై ప్లానింగ్ అనౌన్స్ చేస్తే.. అది కూగా నెగెటివే. మీ అభిప్రాయం తెలుసుకోవాలని అతడు/ఆమె అనుకోవడం లేదని దీంతో క్లియర్ అవుతుంది. మీ సమయానికి అతడు/ఆమె విలువ ఇవ్వడం లేదని దీని అర్థం. మీతో సంప్రదించాలనే ఆలోచన కూడా భాగస్వామికి లేదని ఇది స్పష్టం చేస్తుంది.

4. అవైడ్.. అవైడ్

భాగస్వామి మీతో గడపడానికి సమయం కేటాయించకపోవడం రెడ్ సిగ్నల్.  అందుకోసం కనీస ప్రయత్నాలను చేయకపోవడం ఇంకా నెగెటివ్ అంశం. మీరు ఫస్ట్ ప్రయారిటీ కాకపోవడం వల్లే ఇలా చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.  మీపై నిజంగా శ్రద్ధ ఉంటే.. మీతో గడిపే సమయాన్ని పెంచుతారే తప్ప తగ్గించడు.

5.ఓన్లీ నీడ్

భాగస్వామి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే మీతో మాట్లాడితే.. అది స్వార్థం కిందికి వస్తుంది. దీంతో మీకు చాలా బాధ కలుగుతుంది. మంచి సంబంధం ఉన్నప్పుడు  సహాయం కోరితే ప్రత్యేకంగా కనిపించదు. సంబంధాలలో దూరం పాటిస్తూ.. అవసరాల కోసం దగ్గరికి వస్తే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టు కాదు.

6.నో ఇంట్రెస్ట్

భాగస్వామి మీతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపకుంటే అది కూడా నెగెటివ్ పాయింటే. మీతో గడిపే టైం వచ్చినా తప్పించుకుంటే.. అది ఒక హెచ్చరిక సంకేతం. మీకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం అంటే.. భాగస్వామి మీతో ఇంకా ఎమోషనల్‌గా అటాచ్ కాలేదని అర్థం.

7.నో ప్లేస్ ఇన్ ఫ్యూచర్ 

భాగస్వామి మీ అభిప్రాయాన్ని వినకుండానే ముఖ్యమైన భవిష్యత్ నిర్ణయాలను తీసుకుంటే.. మీరు వారికి అంత ముఖ్యం కాదని స్పష్టమవుతుంది. నిజమైన సంబంధం అంటే ఒక టీమ్‌లా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు నడవాలి. భాగస్వామి మీకు తగిన ప్లేస్ ఇవ్వకపోవడం వల్లే.. అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం లేదని అర్థం చేసుకోవాలి.  ఈ సమస్య గురించి ఇద్దరూ బహిరంగంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవాలి. అపార్థాలను(8 Signs) తొలగించుకోవాలి.

8.వన్ సైడ్ డెసిషన్స్

భాగస్వామి మిమ్మల్ని సంప్రదించకుండా.. మీ ఒపీనియన్‌ను తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని రెడ్ సిగ్నల్‌గా పరిగణించాలి. మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్లే ఇలా వన్ సైడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములిద్దరూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువనివ్వాలి. కీలకమైన నిర్ణయాలలో ఒకరి అభిప్రాయాన్ని మరొకరు పంచుకోవాలి.

Also Read: Kitchen Tips : పచ్చి మిరపకాయలను ఎక్కువరోజులు నిల్వ చేసే చిట్కాలివీ