UV Rays Protection: హానికారక యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం ఇలా..

ఎండ వల్ల శరీరానికి విటమిన్ డీ అందుతుంది. అది మన ఎముకలను దృఢతరం చేస్తుంది.

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 08:15 AM IST

ఎండ వల్ల శరీరానికి విటమిన్ డీ అందుతుంది. అది మన ఎముకలను దృఢతరం చేస్తుంది. ఇటువంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సూర్యరశ్మి వల్ల మనకు కలుగుతాయి. ఇదే సమయంలో ఎండలో ఎక్కువ సమయం పాటు గడిపితే తీవ్ర ఆరోగ్య నష్టాలు కూడా కలుగుతాయి. అతినీల లోహిత (యూవీ) కిరణాల ప్రభావము బారిన శరీరం పడితే సన్ బర్న్ సహా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇవి ఎదురుకాకూడదు అంటే.. ఎండలో తిరిగే క్రమంలో మనము కొన్ని ముందుజాగ్రత్త చర్యలతో వ్యవహరించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సన్‌స్క్రీన్ లోషన్..

మీరు సూర్య కిర‌ణాల నుంచి మీ ముఖం, చర్మాన్ని రక్షించు కోవాలనుకుంటే సన్‌స్క్రీన్ లు వాడాల్సి ఉంటుంది. వేసవిలో సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో, బలమైన సూర్యకాంతి ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి వాతావరణంలో సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి..  చర్మం దెబ్బతినకుండా రక్షించడానికి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. సన్‌స్క్రీన్ మన చర్మంపై పొరలా పని చేస్తుంది. సన్‌స్క్రీన్‌లలో ఉండే జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ సూర్యుని హానికరమైన కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడతాయి.  సన్‌స్క్రీన్ మన చర్మాన్ని సన్‌బర్న్ నుండి రక్షిస్తుంది. హానికరమైన సూర్య కిరణాలు చర్మానికి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. దీని కారణంగా చర్మంపై టానింగ్ భయం ఉంటుంది. చర్మాన్ని టానింగ్ నుంచి రక్షించడంలో సన్‌స్క్రీన్ లోషన్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

* SPF ..

సన్‌స్క్రీన్‌ను ఎంచుకునేటప్పుడు SPF గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. SPF 15-30 ఉన్న సన్‌స్క్రీన్ సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. సన్‌స్క్రీన్‌ని కొనుగోలు చేసే ప్రాథమిక ప్రమాణం SPF. SPF అది ఫిల్టర్ చేయగల UVB కిరణాల మొత్తాన్ని సూచిస్తుంది.

* చర్మాన్ని బట్టి..

ఎల్లప్పుడూ చర్మానికి అనుగుణంగా సన్‌స్క్రీన్‌ని ఎంచుకోండి. జిడ్డుగల చర్మం కోసం జెల్ లేదా స్ప్రేతో కూడిన సన్‌స్క్రీన్‌ను కొనుగోలు చేయండి. జెల్ బేస్ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం ద్వారా చర్మం చాలా జిడ్డుగా కనిపించదు. సూర్యుడి హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోండి.మీకు ఫెయిర్ స్కిన్ టోన్ ఉంటే, మీరు 30-50 SPF మధ్య ఉండే సన్‌స్క్రీన్‌ని ఎంచుకోవాలి. 6 నుండి 15 SP ఉన్న సన్‌స్క్రీన్ నల్లని చర్మానికి మంచిది. ముదురు చర్మానికి 2 నుండి 10 SPF సన్‌స్క్రీన్ మంచిది.

* విటమిన్ బి 3..

విటమిన్ బి 3 వినియోగాన్ని పెంచడం వల్ల అతినీలలోహిత (యువి) కిరణాల నుంచి చర్మం రక్షణ పొందంటంతో పాటు, మెలనోమా కాని చర్మ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవలి పరిశోధనలో తేలింది. ఇటలీలోని పరిశోధకులు మెలనోమా కాని చర్మ క్యాన్సర్ ఉన్న రోగుల చర్మం నుండి కణాలను (హ్యూమన్ ప్రైమరీ కెరాటినోసైట్స్) వేరుచేశారు. ఈ కణాలను విటమిన్ బి 3 యొక్క ఒక రూపమైన నికోటినామైడ్ (NAM) యొక్క మూడు వేర్వేరు సాంద్రతలతో 18, 24, 48 గంటలు చికిత్స చేసి, ఆపై యూవీబీ కిరణాలతో ప్రభావితం చేశారు. యూవీ వికిరణానికి 24 గంటల ముందు 25mM NAM తో చేసిన ప్రీ-ట్రీట్మెంట్ చర్మ కణాలను యువి- ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాల నుంచి రక్షించింది. డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడింది. మెరుగైన డీఎన్‌ఏ మరమ్మత్తుకు ఉపయోగపడింది. యాంటీఆక్సిడెంట్ వ్యక్తీకరణను తగ్గించింది. ప్రయోగాన్ని నిశితంగా గమనించిన సైంటిస్టులు చర్మ సంరక్షణకు బి 3 విటమిన్ ఎంతో ఉపయోగకారిగా పేర్కొన్నారు.

* కలబంద..

కలబంద మన శరీరంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. పిగ్మంటేషన్ ని తగ్గించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అందుకే దీన్ని రెగ్యులర్ గా రాసుకుంటూ ఉండడం వల్ల మీ చర్మం డీటాన్ కావడం మాత్రమే కాదు.. ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది

* UVA కిరణాలంటే..

UVA కిరణాలు చర్మంలోని మందమైన పొరలోకి చొచ్చుకుపోతాయి. దీన్ని ‘డెర్మిస్’ అని పిలుస్తారు. UVA కిరణాల వల్ల చర్మం ముడతలు పడటమే కాకుండా, వృద్ధాప్య చాయలు కనిపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.

* UVB కిరాణాలంటే..

UVB కిరణాలు తక్కువ వేవ్ కలిగి ఉంటాయి. ఇవి చర్మం పై పొరను కాల్చేస్తాయి. UVB కిరణాలు చర్మ క్యాన్సర్‌కు దారితీస్తాయి. యూవీబీ కిరణాల వల్ల వడదెబ్బకు గురయ్యే అవకావశాలు కూడా ఎక్కువే.