7 Things Men Do When They Cheat In a Relationship : భాగస్వామి మోసం చేస్తున్నాడని తెలిపే 7 విషయాలు..!

7 Things Men Do When They Cheat In a Relationship రిలేషన్ షిప్ లో మిమ్మల్ని మీ పార్ట్ నర్ మోసం చేస్తున్నాడని చెప్పేందుకు 7 సంకేతాలు

  • Written By:
  • Publish Date - October 30, 2023 / 11:38 PM IST

7 Things Men Do When They Cheat In a Relationship రిలేషన్ షిప్ లో మిమ్మల్ని మీ పార్ట్ నర్ మోసం చేస్తున్నాడని చెప్పేందుకు 7 సంకేతాలు ఉన్నాయి. వాటి వల్ల మీకు అతను దూరం అవుతున్నాడని గుర్తించవచ్చు. ఇంతకీ భాగస్వామి మోసం చేస్తున్నాడని సూచించే ఆ అంశాలు ఏంటంటే..

We’re now on WhatsApp : Click to Join

1. గమనించేలా మార్పులు

ఎప్పుడూ లేనిది మీ భాగస్వామి కొత్త మార్పులతో కనిపిస్తాడు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడతాడు. అతనిలోని మార్పులను మీరు కనిపెట్టగలుగుతారు.

2. లుక్ మీద శ్రద్ధ

మీరు కాకుండా అతని జీవితంలోకి మరొకరు వచ్చారన్న విధంగా అతను ఎప్పుడు లేనిది పర్సనల్ కేర్ తీసుకుంటాడు. లుక్ డ్రెస్ సెన్స్ మీద ఎప్పుడు లేనిది శ్రద్ధ తీసుకుంటాడు. ఆ టైం లో మీరు అతన్ని గమనించాల్సి ఉంటుంది. ఇవన్ని అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని గుర్తించాలి.

3. ఫిట్నెస్ మీద ఫోకస్

మరొకరితో పరిచయం వారి ముందు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన అతనికి ఉంటుంది. అందుకే అతను ఎప్పుడు లేనిది ఫిట్ నెస్ మీద దృష్టి పడతాడు. ఇలా చేస్తున్న వారిని కూడా ఒక కంట కనిపెట్టాల్సి ఉంటుంది.

4. పర్ఫ్యూమ్స్ వాడటం

ఎప్పుడు లేనిది అతను పర్ఫ్యూమ్స్ వాడటం కూడా మొదలు పెడుతుంటాడు. వేరొక వ్యక్తితో పరిచయం వల్ల వారిని ఇంప్రెస్ చేయాలని చూస్తారు. అందుకే వారి దగ్గరకు వెళ్లగానే మంచి సువాసన వెదచల్లాలని పర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. అలాంటి వారు కూడా భాగస్వామిని మోసం చేస్తున్నాడని గుర్తించాలి.

Also Read : Relationship : ఈ 9 విషయాలు జరిగితే.. మీ బోయ్ ఫ్రెండ్ కి దూరమవడం మంచింది..!

5. వ్యక్తిగత శ్రద్ధ

ఎప్పుడు కూడా ఎలా కనిపించినా సరే ఓకే అనుకునే అతను నీట్ గా గడ్డెం లేకుండా రోజు కనిపిస్తున్నా సరే అతను వేరే ఎవరితోనో పరిచయం పెంచుకుంటున్నాడని అనుకోవచ్చు. పర్సనల్ కేర్ మీద దృష్టి పెడుతున్నారంటే దానికి బలమైన కారణం ఉంటుంది. మరి అది వేరొకరితో పరిచయమే అయితే మిమ్మల్ని అతను మోసం చేస్తున్నాడని గుర్తించాలి.

6. ఆన్ లైన్ జాగ్రత్తలు

భాగస్వామి ఫోన్ కి పాస్ వర్డ్ చేంజ్.. ఎప్పుడు కాల్ హిస్టరీ డిలీషన్ ఇలాంటివి జరుగుతుంటే అక్కడ కచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని అనుకోవాలి. అతను వేరొకరితో తరచు టచ్ లో ఉండటం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు తప్పవు.

7. మీతో గడిపే సమయం లేకపోవడం

వేరొక వ్యక్తికి ఎంత టైం అయినా ఇస్తారు కానీ మీతో గడిపే సమయం లేదని చెబుతుంటారు. ఎక్కువసేపు బయట ఉంటారు. మీతో టైం కేటాయించేందుకు ఆసక్తి చూపించరు. ఇలాంటి వారు కచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారని గుర్తించాలి.