Site icon HashtagU Telugu

7 Signs Of Fantasies : మీ భాగస్వామి మరొకరితో లైన్‌లో ఉన్నాడనడానికి 7 సిగ్నల్స్

7 Signs Of Fantasies

7 Signs Of Fantasies

7 Signs Of Fantasies : మీ జీవిత భాగస్వామి వేరొకరి గురించి పగటి కలలు కంటున్నారా ? మిమ్మల్ని మోసం చేసే ఆలోచనల్లో.. మీ నుంచి గ్యాప్ పెంచుకునే ఊహల్లో అతడు/ఆమె తేలియాడుతున్నారని మీకు అనిపిస్తోందా ? మీ జీవిత భాగస్వామి ఊహల్లో కదలాడుతున్నది మీకు తెలిసిన వారే అయి ఉండొచ్చు లేదా తెలియనివారు కూడా అయి ఉండొచ్చు. చాలామంది పురుషులు, మహిళలు ఈవిధంగా తమ భాగస్వామి కాకుండా మరొకరి గురించి ఊహల్లో మునిగి తేలుతుంటారని మానసిక అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలు వస్తే ఫర్వాలేదు. కానీ జీవిత భాగస్వామిని పూర్తిగా పక్కన పెట్టేసేలా ఆ ఆలోచనలు, ఊహలు చుట్టూ ముసురుకుంటే .. అది భార్యాభర్తల మధ్య  అగాధాన్ని క్రియేట్ చేసే ముప్పు ఉంటుందని మానసిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఊహాలోకంలో తేలియాడే జీవిత భాగస్వాముల వ్యవహార శైలితో ముడిపడిన 7 సంకేతాల గురించి ఇప్పుడు(7 Signs Of Fantasies) తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

1. అకస్మాత్తుగా కొత్త అభిరుచులు 

మీకు, మీ జీవిత భాగస్వామికి  వేర్వేరు అభిరుచులు, ఆసక్తులు ఉంటాయి. కానీ మీ భాగస్వామి అకస్మాత్తుగా అభిరుచిని మార్చుకుంటే.. మునుపెన్నడూ లేని విధంగా కొత్త అభిరుచిని పెంచుకోవడం మొదలుపెడితే అది రెడ్ సిగ్నల్. వారు వేరొకరి నుంచి స్ఫూర్తి పొంది.. ఆ అభిరుచిని అందిపుచ్చుకున్నారని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. బహుశా ఆ కొత్త అభిరుచి అనేది మీ జీవిత భాగస్వామికి, ఆ మూడో వ్యక్తికి మధ్య కనెక్టింగ్ పాయింట్‌గా మారి ఉండొచ్చని కూడా అంచనా వేసుకోవచ్చు.

2. మాటల్లో ఊహలు 

మీ జీవిత భాగస్వామి బెడ్‌రూమ్‌లో, బయట.. ఏదైనా ఎంజాయ్‌మెంట్ గురించి అద్భుతంగా వర్ణనలు చేసి వివరిస్తే  అది కూడా రెడ్ సిగ్నలే. ఉదాహరణకు ‘ఒక అందమైన మహిళతో పడవలో వెళ్లడానికి ఇష్టపడతాను’ అని పేరును ప్రస్తావించకుండానే చెప్పినట్లయితే.. దాన్ని కూడా ఒక దారితప్పిన సంకేతంగా పరిగణించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో లైఫ్ పార్ట్నర్‌తో వాగ్వాదం పెట్టుకోవడం కంటే ప్రేమభావనతో చేరువ కావడం, చర్చించడం ఉత్తమం.

3. మీకు మరొక పేరు

మీకు సన్నిహితమయ్యే క్షణాల్లో జీవిత భాగస్వామి.. వేరొకరి పేరుతో మిమ్మల్ని పిలిస్తే అది కూడా రెడ్ సిగ్నలే. నిత్యం ఆ వ్యక్తి గురించి మీ లైఫ్ పార్ట్నర్ ఊహించుకుంటున్నారు అనేందుకు ఇది స్పష్టమైన సంకేతం.  భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని మరో పేరుతో పిలిచినా.. ఏదో జరుగుతోందని సందేహించవచ్చు.

4. భవిష్యత్తుపై నో చర్చ 

మీ లైఫ్ పార్ట్నర్ భవిష్యత్తు గురించి మీతో చర్చించకుండా.. దూరాన్ని పాటిస్తుండటం అనేది డేంజర్ బెల్. కనీసం వీకెండ్‌లో కూడా మీకు సమయాన్ని కేటాయించకపోడం, కుటుంబంతో వెచ్చించే సమయాన్ని తగ్గించడం కూడా కీలకంగా గమనించాల్సిన అంశాలు. వీటిని బట్టి మీ లైఫ్ పార్ట్నర్ మరేదో అంశానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.

5. టైమంతా రహస్య నేస్తానికే  

మీ భాగస్వామి ఒకవేళ ఇతరుల గురించి ఊహల్లో తేలుతుంటే.. వారితో సమయాన్ని వెచ్చించే ప్లాన్ కచ్చితంగా చేస్తారు. ఆ రహస్య నేస్తాన్ని కలవడానికి, ముచ్చటించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో మీకు కొంత దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు కేటాయించే టైంలో కోత పెట్టే రిస్క్ ఉంది. ఇంట్లోనే ఉన్నా.. మీరు పక్కనే ఉన్నా.. మిమ్మల్ని పెద్దగా పట్టించుకోనంత బిజీగా మారిపోయే అవకాశాలు పెరుగుతాయి.

6. ఒంటరి పయనం

మీ లైఫ్ పార్ట్నర్ ఇతరులకు చేరువయ్యే ప్రయత్నంలో ఉండి ఉంటే.. మీతో శృంగార సంబంధాలను కూడా చాలావరకు తగ్గించుకుంటారు. సాధ్యమైనంత మేర మిమ్మల్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. విడిగా నిద్రపోయేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి టైంలో మీరు మీ జీవిత భాగస్వామిని అనుమానించడం తప్పేం కాదు. నిలదీయడం తప్పేం కాదు.

7. మతిమరుపు 

ఇతరులతో అఫైర్‌ను మొదలుపెట్టిన హడావుడిలో ఉండి ఉంటే.. మీ లైఫ్ పార్ట్నర్‌కు కొంత మతిమరుపు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈక్రమంలో కుటుంబ సభ్యుల బర్త్ డేలు, పెళ్లి రోజులు వంటివి కూడా మర్చిపోయే ప్రవర్తించే అవకాశం ఉంది. ఇంటి బాధ్యతలకు కూడా ప్రయారిటీని తగ్గిస్తే.. మీరు ఇక జీవిత భాగస్వామిని బలంగా సందేహించవచ్చు. మీ పార్ట్నర్ ఫోకస్ మరొకరిపై ఉండటం వల్ల ఇంటి బాధ్యతలపై ఆసక్తి రావడం లేదని మీరు అర్థం చేసుకోవచ్చు.

Also Read: KCR : కామారెడ్డిలో పౌల్ట్రీ రైతుల నుండి కేసీఆర్ కు పెద్ద చిక్కొచ్చి పడింది