Site icon HashtagU Telugu

7 Ways To Get Nutrition: పౌష్టికాహారాన్ని పవర్ ఫుల్ ఫుడ్ గా మార్చే చిట్కాలు ఇవిగో..!!

Healthy Food Imresizer

Healthy Food Imresizer

మంచి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారం అవసరం. దీని విషయంలో భారతీయులు అత్యంత అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉంటున్నారు. పండ్లు, కూరగాయలను తగిన స్థాయిలో డైట్ లో చేర్చుకునే విషయాన్ని దాదాపు 80 శాతం మంది భారతీయులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)
తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయినా ఆరోగ్యం విషయంలో భారతీయుల అవగాహన స్థాయి మునుపటి కంటే గణనీయంగా పెరిగిందని తేలింది. ఈనేపథ్యంలో ఫిట్ గా ఉండేందుకు అవసరమైన, పాటించాల్సిన పలు చిట్కాలను పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వేరే ధ్యాస వద్దు

అన్నం తినేటప్పుడు వేరే ధ్యాస వద్దు. కేవలం ఫుడ్ పైనే దృష్టి పెట్టండి. ఫుడ్ తినే టైం లో వర్క్ చేయొద్దు. టెన్షన్ కు గురి అవుతూ ఫుడ్ తినొద్దు. నోటిని శుభ్రంగా కడుక్కొని, ఒకసారి కుక్కిలించాక ఫుడ్ తినండి. ఎందుకంటే మీరు బాడీకి అందించే ఫుడ్ కు ఎంట్రీ పాయింట్ నోరే. ప్రతిరోజూ ఒకే టైంలో మూడు పూటలా భోజనం చేయండి. ఫలితంగా దానికి అనుగుణంగా మీ జీవక్రియలు అడ్జస్ట్ అయిపోతాయి.

* శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచండి

శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి. ఇందుకోసం బాగా నీళ్లు తాగండి. నీళ్లు సరిగ్గా తాగకపోతే నీరసం, అలసట త్వరగా ఆవరిస్తాయి. మల బద్ధకం, మూర్ఛ, నిద్ర మత్తు మిమ్మల్ని చుట్టుముడుతాయి.

*డైట్ లో డైవర్సిటీ

మీ డైట్ డైవర్సిఫైడ్ గా ఉండేలా చూసుకోండి. అన్ని రకాల కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లను మెనూలో ఉండేలా చూసుకోండి. కొన్ని కూరగాయలు, తృణ ధాన్యాలను పచ్చిగా తినాల్సి ఉంటుంది. వాటిని వండి తింటే పోషక విలువలు నశిస్తాయి. ఈ తేడాను గుర్తిస్తూ ఇంట్లో వంటలు తయారు చేసుకోవాలి.

* హై క్వాలిటీ ఫ్యాట్స్ మాత్రమే

మీ ఇంట్లో వంటల తయారీకి హై క్వాలిటీ ఫ్యాట్స్ ఉండే నూనెలే వాడండి. సాధారణ వంటల తయారీకి కొబ్బరి నూనె, ఆవాల నూనె,నువ్వుల నూనె, ఘి వాడొచ్చు. సలాడ్స్ తయారీకి ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది.

* కార్బో హైడ్రేట్స్.. ఐటమ్స్

మీ మెనూలో కార్బో హైడ్రేట్స్ ఉండే పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తప్పనిసరిగా ఉండాలి. గోధుమ పాస్తా, క్వినోవా, ఓట్స్ ను మీరు తింటే మంచిది. గోధుమలు, మొక్క జోన్న, జొన్న, సజ్జలు, రాగుల పిండితో తయారు చేసే వంటకాలు కూడా తినాలి. కాయ ధాన్యాలు, తృణధాన్యాలను వంటల్లో భాగం చేసుకోవాలి. తద్వారా వాటి రుచి మరింత పెరుగుతుంది. వాటిని తినడం వల్ల ఎనర్జీ కూడా లభిస్తుంది.

* సుగంధ ద్రవ్యాలు సూపర్

యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క , మిరియాలు, కారం, పసుపు వంటివి వంటలలో తగినంత వాడాలి. ఫలితంగా వంటల రుచి ఇనుమడిస్తుంది. వాటి వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసే స్వభావం సైతం ఈ ఐటమ్స్ కు ఉంది. హృద్రోగాల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

* నాన్ స్టిక్ కుక్ వేర్ వాడొద్దు

వంటల తయారీకి నాన్ స్టిక్ కుక్ వేర్ వాడొద్దు.వీటిపై ఉండే టెఫ్లన్ కోటింగ్ వల్ల..ఆహార ప్రియులకు క్యాన్సర్, ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని బదులు Cast iron మెటీరియల్ పై వంటలు వండటం మంచిది.