Healthy Skin: మెరిసే చర్మానికి 6 రకాల జ్యూస్‌లు..!!

మన జీవనశైలి బాగుంటే...మన ఆరోగ్యం బాగుంటుంది. నేటికాలంలో బిజీ లైఫ్ కారణంగా...ఆరోగ్యంపై శ్రద్ద చూపడం తగ్గుతుంది.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 11:48 AM IST

మన జీవనశైలి బాగుంటే…మన ఆరోగ్యం బాగుంటుంది. నేటికాలంలో బిజీ లైఫ్ కారణంగా…ఆరోగ్యంపై శ్రద్ద చూపడం తగ్గుతుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందించాలి. పండ్లు, కూరగాయలతో ఇంట్లోనే జ్యూస్ చేసుకుని తాగుతే మంచి ప్రయోజనం ఉంటుంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయాల్లో తక్కువ కేలరీలు ఉంటాయి. అవి మిమ్మల్ని ఎక్కువ సమయం ఆకలి నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా చర్మం పొడిబారినట్లు…ఢల్ గా కనిపిస్తే పండ్లు, తాజా కూరగాయాలతో తయారు చేసిన జ్యూస్ తాగినట్లయితే…మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అయితే ఈ జ్యూస్ లో బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.

ఈ రోజు మనం మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేసే 6 జ్యూస్‌ల గురించి తెలుసుకుందాం.
1. ఆరెంజ్, అల్లం జ్యూస్:
సిట్రస్ పండ్లు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మెరిసేలా చేస్తాయి. సిట్రస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి UV రేడియేషన్ నుంచి రక్షిస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అల్లం, ఆరేంజ్ జ్యూస్ తాగితే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.

2. టమోటా జ్యూస్:
విటమిన్-సి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొల్లాజెన్ ఏర్పడటంలో దాని యాంటీఆక్సిడెంట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టొమాటోలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

3. బీట్ రూట్ బాదం జ్యూస్:
విటమిన్-ఇ కూడా మన చర్మంలో చికాకును తగ్గిస్తుంది. UV ఎక్స్పోజర్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించగలవని అనేక అధ్యయనాలు నిరూపించాయి. బీట్‌రూట్ , బాదం రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

4. లీఫీ గ్రీన్ వెజిటబుల్ జ్యూస్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కెరోటినాయిడ్స్ అద్భుతమైన మూలం. విటమిన్-ఎ లేదా కెరోటినాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి హాని జరగదు. ఈ జ్యూస్ చేయడానికి, ఒక కప్పు కాలే,బచ్చలికూరను తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులను వేసి మీకు నచ్చిన పండ్లను వేసి జ్యూస్ తయారు చేసుకోని తాగవచ్చు.

5. క్యారెట్ జ్యూస్:
క్యారెట్‌లో బయోటిన్, విటమిన్ ఎ రెండింటితో సహా చర్మాన్ని పెంచే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ జ్యూస్ ప్రయోజనాలను మెరుగుపరించేందుకు ఇందులో కొంచెం పసుపును చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పసుపు ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

6. ఆపిల్, పుదీనా జ్యూస్:
యాపిల్‌లో కొన్ని పుదీనా ఆకులను జోడించి ఈ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. అవి పెక్టిన్‌ను కూడా కలిగి ఉంటాయి, గట్ బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. పుదీనా ఆకులు చర్మ రంధ్రాలను శుభ్రపరచి చర్మాన్ని మృదువుగా హైడ్రేట్ గా మార్చుతాయి. ఇది కాకుండా, ఇది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుండంతోపాటు ముడతలను తొలగిస్తుంది.