Happy Marriage: దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే!!

నేటియుగంలో భార్యభర్తలు ఉద్యోగాలు చేస్తేనే సంసారం సవ్యంగా సాగిపోతుంది.

  • Written By:
  • Updated On - April 26, 2022 / 01:26 PM IST

నేటియుగంలో భార్యభర్తలు ఉద్యోగాలు చేస్తేనే సంసారం సవ్యంగా సాగిపోతుంది. అయితే ఎక్కువ మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ..భర్తకు భార్య దూరంగా…భార్యకు భర్త దూరంగా ఉంటున్నారు. ఇద్దరు పనిచేస్తే కానీ గడవని నేటి ఆధునిక కాలంలో ఇలా దాంపత్య జీవితానికి దూరగా కాలం వెల్లదీస్తున్నారు. ఇతర వివాహేతర సంబంధాలకు దారితీసి కాపురాలు కూలిపోతున్నాయి. ఈతరం దాంపత్యం ఆనందంగా గడవడం అంత తేలికైన విషయం కాదు. సర్దుబాటు చేసుకోలేక విడిపోతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎన్నో జంటలు ఇలాగే విడిపోయాయి. మరి సంతోషకరమైన దాంపత్యం కోసం ఏం చేయాలన్న దానిపై ఇప్పుడందరూ ఆలోచన చేస్తున్నారు.

చాలామంది దాంపత్య జీవితంలో ఎలాంటి సుఖంలేదని బహిరంగంగానే చెబుతున్నారు. భర్తపై భార్యకు, భార్యపై భర్తకు కోపాలు, కొట్లాటలు ఉన్నాయి. ఎంతో బిజీగా ఉండే ఈ కాలంలో భార్యాభర్తలు తమ సమయాన్ని ఒకరికోసం ఒకరు కేటాయించుకోవడం లేదు. అయితే నిపుణులు మాత్రం ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవాలని సూచిస్తున్నారు.

టూర్ ప్లాన్ చేయడం…

ఉద్యోగం, బిజినెస్ ఇలా ఏ పనిచేసినా…అందులో బిజీగా ఉండటం కామన్ . కానీ ఏడాదిలో ఒకసారైనా దంపతులు టూర్ ప్లాన్ చేసుకోవాలి. ఆనందంగా గడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్తే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. బడ్జెట్ ఎక్కువ అవుతుందని విదేశాలకు కాకుండా మన దగ్గరలోనే ప్రాంతాలకు వెళ్లితే ఆనందంతోపాటు ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుంది.

దాంపత్యం విడిపోవడానికి ప్రధాన కారణం…
దాంపత్యం విడిపోవడానికి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. చాలీచాలని జీతాలు..ఇంట్లో అవసరాలు తీరకనే…తరుచుగా భార్యభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. సరదాగా గడిపేందుకు సమయానికి డబ్బులేకపోవడంతో విడాకులకు దారితీస్తున్నాయి. అందుకే ఆర్థికపరమైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. వీలైనంత వరకు ఖర్చు లేకుండా వైవాహిక జీవితాన్ని సాగించడం ముఖ్యం.

శృంగార దాంపత్య జీవితం…
శృంగారం దాంపత్య జీవితాన్ని ఎక్కువ కాలం సంతోషంగా కొనసాగించేలా చేస్తుంది. వీలైనంత వరకు ఎక్కువసార్లు కలిసి ఉండే దంపతుల మధ్య విభేదాలు తలెత్తవు. టీవీ షోలు చూడటం, కలిసి వంట చేయడం, కలిసి ఇంటిని శుభ్రం చేయడం ఇలా చేస్తే ఇద్దరు కూడా కష్టాలను పంచుకున్నట్లు అవుతుంది. తద్వారా వారిలో ఉన్న అపోహలు, కోపతాపాలు దూరం అయి దాంపత్య జీవితం సాపీగా సాగుతుంది.