6 Signs You Are Not A Couple : రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా.. ఈ విధమైన ప్రణాళికలు ఉంటే వారు కేవలం కలిసి ఉన్నా రూం మెట్స్ మాత్రమే అవుతారు తప్ప వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నట్టు కాదు. కొన్నాళ్లు కలిసి ఉండి కొంతకాలం తర్వాత వారి మధ్య ఏవో కారణాల వల్ల గ్యాప్ వస్తే వారి మధ్య రిలేషన్ షిప్ బ్రేక్ అవుతుంది. అయితే వారు ఒకే ఇంట్లో ఉంటూనే వారి పనులు చేసుకుంటారు. ఈ 6 సంకేతాలు వీటిని నిర్ధారణ చేస్తాయి. అవేంటన్నది చూస్తే..
We’re now on WhatsApp. Click to Join.
1. ప్రత్యేక జీవితాలు..
రిలేషన్ షిప్ లో ఉంటూ ఎవరికి వారు పనులు చేసుకుంటూ ఉంటే వారి మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వస్తుంది. ఇంట్లో ఒకరినొకరు (Couple) చూసుకుంటారు కానీ మీ స్వంత మార్గాల్లో నడుస్తుంటారు. కలిసి ఉన్నా ఎవరికి వారు అన్నట్టుగా ఉంటారు.
2. సాన్నిహిత్యం లేకుండా..
రిలేషన్ షిప్ లో సాన్నిహిత్యం అనేది చాలా అవసరం. ఎవరికి వారి ఉంటూ రిలేషన్ షిప్ లోని రొమాన్స్ ని ఎంజాయ్ చేయలేకపోవడం అనేది వారి దూరానికి కారణం అవుతుంది. శారీరక సాన్నిహిత్యం అనే కాదు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా జరగాలి ఇలా లేదంటే వారి మధ్య దూరం పెరుగుతున్నట్టు లెక్క.
3. కమ్యూనికేషన్ లేకపోవడం..
కేవలం ఇంట్లో ఉంటూ ఎవరి పనులు వారు చేసుకోవడం కాదు ఆరోగ్యకరమైన సంభాషణలు ఉండాలి. రిలేషన్ షిప్ లో అర్ధవంతమైన సంభాషణలు.. ఆశ్చర్యకరమైన అంశాలు ఉండాలి. ఆచరణాత్మక విషయాలపై దృష్టి పెట్టాలి. లేదంటే మీరు ఒకే ఇంట్లో కలిసి ఉన్నా రూం మెట్స్ గా మాత్రమే ఉన్నట్టే.
Also Read : Relationship : ఒక వ్యక్తి మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలిపే 9 సంకేతాలు..!
4. షేర్డ్ గోల్స్ లేకపోవడం..
సంబంధంలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కలిసి ప్రయాణం చేయాలి. ఉమ్మడి లక్ష్యాలు, కలలు నెరవేర్చుకునేందుకు ప్రణాళికలు ఉండాలి. అది మిమ్మల్ని దగ్గర అయ్యేలా చేస్తుంది. అయితే అలా కుదరని పక్షంలో మీరు ఒకరినొకరు దూరమవుతున్నారని గుర్తించాలి.
5. మేజిక్ లేకపోవడం..
రిలేషన్ షిప్ మొదట్లో ఏం చేసినా నచ్చుతుంది. అది కాస్త బోర్ కొడితే సమస్యలు వచ్చేస్తాయి. రిలేషన్ షిప్ ని ఎప్పుడు బోర్ గా ఫీల్ అవ్వకూడదు. సరదాగా సరదాగా గడిపిన విషయాలు, సంతోష సమయాలను గుర్తు చేసుకోలేకపోతే మీరు భాగస్వామితో కలిసి ఉన్నా సెపరేట్ గా ఉన్నట్టే.
6. ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం..
జీవితం కష్టతరమైనప్పుడు సాధారణంగా సౌకర్యం కోసం మన భాగస్వాములపై ఆధారపడతాము. కానీ అది లేకపోతే కష్టతరమవుతుంది. ఎవరి సమస్యలు వారివే అన్నట్టుగా మీ భాగస్వామి తో ఎలాంటి సంప్రదింపు మాటలు లేకపోతే దాని వల్ల మీకు జీవితంలో వచ్చిన కష్టాలకు ఎమోషన సపోర్ట్ మిస్ అయినట్టే. అలాంటప్పుడు కలిసి ఉన్నా సరే ఒంటరిగా ఉన్నామన్న భావన వస్తుంది.
Also Read: Ananthagiri Hills: అనంతగిరి అడవుల్లో చిరుత కలకలం, టూరిస్టులు అలర్ట్!