Earphones Danger: ఇయర్ ఫోన్స్ కాదు.. ఫియర్ ఫోన్స్.. అతిగా వాడితే చెవుడు!!

వాడితే వినికిడి సమస్యను ఎదుర్కోక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 07:45 AM IST

టెక్ యుగం ఇది..

గాడ్జెట్స్ లో యూత్ మునిగి తేలుతున్నారు..

ఎక్కడ చూసినా యూత్ చెవిలో ఇయర్ ఫోన్స్‌ కనిపిస్తున్నాయి.

4 నిమిషాలకు మించి ఇయర్ ఫోన్స్
వాడితే వినికిడి సమస్యను ఎదుర్కోక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా యూత్ పెడ చెవిన పెట్టి, ఇయర్ ఫోన్స్ ను నాన్ స్టాప్ గా గంటల తరబడి వాడేస్తున్నారు.

చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ కారణం వల్ల అవి పెద్ద శబ్దాలని తట్టుకోలేవు. చెవులపై ఇయర్ ఫోన్స్ సౌండ్ ఎఫెక్ట్ పడకూడదన్నా.. చెవిలోని కణాలు దెబ్బతినొద్దన్నా ఒకే మార్గం ఉంది.
ఇయర్ ఫోన్స్ వాడకాన్ని తగ్గిస్తే చెవులు సేఫ్ గా ఉంటాయి. మన దేశంలో వయసు పెరగడం వల్ల వినికిడి సమస్యలను ఎదుర్కొనే వారి కంటే ఇయర్ ఫోన్స్ వల్ల వినికిడి సమస్యలను కొని తెచ్చుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందట. తాజా అధ్యయనాలలో ఇదే విషయం తేలింది.

* డబ్ల్యూహెచ్‌ఓ ఏమంటోంది?

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.1 బిలియన్ యువతకు పెద్ద శబ్దంతో సంగీతం వినడం వల్ల వినికిడి లోపం వచ్చే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం హెచ్చరించింది. 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న యువత.. సంగీతం వినడానికి ఇయర్‌ఫోన్‌లు వాడుతుంటే.. వారిలో దాదాపు 50 శాతం మంది ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్‌ వింటున్నారని తెలిపింది. వీరికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది.

* చెవిలో ఫంగస్, బ్యాక్టీరియా..

ఇయర్ ఫోన్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్ ఆపరేటింగ్ ఇయర్ ఫోన్.. వీటిని కర్ణబేరికి అత్యంత దగ్గరగా చెవిలోనే పెట్టుకోవడం వల్ల చెవిలో ఫంగస్, బ్యాక్టీరియాలు పేరుకుంటాయి. దీనివల్ల చెవిలో దురద, నొప్పి, చీము కారడం, పోటు వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెవిలో జోరీగ వాలుతున్నట్టు గుయ్ మని ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇయర్ ఫోన్లు పెట్టుకోవడంతో చెవిలోకి గాలి వెళ్లే అవకాశం తగ్గిపోతుంది. దీంతో చెవిలో ఫంగస్ అతిగా పెరుగుతుంది.

* హెయిర్‌ సెల్స్‌ వైబ్రేషన్స్‌ పై ప్రభావం

మీరు ఎక్కువ సేపు ఇయర్‌ ఫోన్స్‌ వాడితే.. చెవులో ఉండే హెయిర్‌ సెల్స్‌ వైబ్రేషన్స్‌ పై ప్రభావం పడుతుంది. హెయిర్‌ సెల్స్‌ వాటి సున్నితత్వాన్ని కోల్పోయి… కిందికి వంగి ఉంటాయి. తద్వారా వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంది.

* సౌండ్ 60 డెసిబుల్స్‌ దాటొద్దు

సౌండ్‌ను డెసిబుల్స్‌లో కొలుస్తారు. ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు సౌండ్‌ 60 డెసిబుల్స్‌ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 60 డెసిబుల్స్‌ సౌండ్ తో మీరు ఎక్కువ సేపు ఇయర్‌ ఫోన్స్‌తో పాటలు విన్నా పెద్ద సమస్య ఉండదు. కానీ 85 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ సౌండ్‌ పెట్టుకుంటే మాత్రం.. వినికిడి లోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల విరామం, ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల విరామం తీసుకోవాలి.

* హెడ్‌ఫోన్లు సేఫ్..

మనం సాధారణంగా ఇయర్‌ ఫోన్స్‌ను.. హెడ్‌ ఫోన్స్‌ అని పిలుస్తాం. కానీ అవి రెండూ ఒకటి కాదు. ఇయర్‌ ఫోన్‌లు చిన్నగా చెవిలో సరిపోయేటట్టు ఉంటాయి. హెడ్‌ ఫోన్లు చెవిమీద పెడతాం. హెడ్‌ఫోన్లు పెట్టుకుంటే.. శబ్ధానికి, కర్ణభేరి మధ్య గ్యాప్‌ ఉంటుంది. తద్వారా చెవిపై అంతగా ప్రభావం చూపవు.

* హైపర్ అక్యూసిస్

ఇయర్ ఫోన్స్ పెట్టుకొని భారీ సౌండ్ తో వీడియోలు చూసేవారిలో కర్ణభేరి పనితీరు మందగిస్తుంది. ఫలితంగా అది మునుపటిలా పనిచేయలేదు. చెవులకు ఆరో ప్రాణమైన కర్ణభేరి వీక్ కావడం వల్ల ఏవైనా భారీ సౌండ్స్ ను వినే ఓపిక కూడా లేకుండాపోతుంది. ఈ బలహీనతనే హైపర్ అక్యూసిస్ అంటారు.