Copper Bottle Benefits: రాగి పాత్రల్లో నీళ్లు.. ఆరోగ్యానికి అమృతపు జల్లు!!

ప్రస్తుత జీవనశైలి ప్రభావం మనుషులపై స్పష్టంగా కనిపిస్తోంది. మధుమేహం, క్యాన్సర్, హైబీపీ, కిడ్నీ సమస్యలు పిల్లల నుంచి పెద్దల దాకా అందరిని వేధిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 07:30 AM IST

నిజంగా అమృతమే.. ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు

ప్రస్తుత జీవనశైలి ప్రభావం మనుషులపై స్పష్టంగా కనిపిస్తోంది.
మధుమేహం, క్యాన్సర్, హైబీపీ, కిడ్నీ సమస్యలు పిల్లల నుంచి పెద్దల దాకా అందరిని వేధిస్తున్నాయి. వీటికి ఆయుర్వేదం ఎన్నో పరిష్కారాలను సూచిస్తోంది. వాటిలో ఒకటి..కాపర్ వాటర్ బాటిల్స్ , గ్లాసులు, జగ్గులు. మన పూర్వీకులు రాగి పాత్రలు, రాగితో తయారు చేసిన వస్తువులను విపరీతంగా వినియోగించే వాళ్లు. అందువల్లే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేవారు. రాగిపాత్రలో నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనితో మన శరీరానికి అవసరమైన మినరల్స్ లభిస్తాయి. అంతేకాక, ఇవి మన శరీరంలోని హానికారక బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తాయి.

* రక్తపోటు నియంత్రణలోకి..

రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు కూడా ధృడంగా ఉంటాయి.రాగి పాత్రలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి. మీ రక్త ప్రవాహంలో తగినంత కాపర్ శాతం లేకపోతే రక్తపోటు సమస్య అధికమయ్యే అవకాశం ఉంది. మీ మెదడు సరిగ్గా పనిచేయాలన్నా, ఒత్తిడి నుండి బయటపడాలన్నా మీ శరీరానికి కాపర్ చాలా అవసరం అని గుర్తించుకోండి.

* క్యాన్సర్‌ ముప్పునకు చెక్

రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటి ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌‌‌కు దారితీసే కణాలతో పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చేసుకోవచ్చు. అలాగే థైరాయిడ్‌ను మెరుగుపర్చడంలో మంచి ఉపయోగం ఉంటుంది.

* యాంటీ బ్యాక్టీరియల్ ..

రాగికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో పూర్వ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. మీరు 8 లేదా అంతకంటే ఎక్కువ గంటలు రాగి పాత్రలలో నీటిని నిల్వ చేస్తే, ఆ నీటిలోని అన్ని రకాల ప్రమాదకర సూక్ష్మజీవులు నశిస్తాయి. అందువల్ల, ప్లాస్టిక్ బాటిల్ బదులు రాగి నీటి బాటిల్‌ను ఉపయోగించడం చాలా ఉపయోగకరం అని గుర్తించుకోండి.

* రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

రాగి బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. రాగి మీ రక్తప్రవాహంలోని తెల్ల రక్త కణాల సంఖ్యను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల, రాగి పాత్రల్లో ఆహారం తినడం, నీరు త్రాగడం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి.

* ఎముకలు దృఢం..

ఎముకలను బలోపేతం అవ్వడానికి విటమిన్ ‘డి’ చాలా అవసరం. విటమిన్ ‘డి’ సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అందువల్ల ఇంట్లోనే ఎక్కువ సేపు గడపకుండా కొంతసేపు సూర్మరశ్మిలో ఉండటం మంచిది. విటమిన్ ‘డి’ లోపమే కాకుండా శరీరంలో కాపర్ లోపం కూడా ఎముకల సాంద్రతను ప్రభావితం చేస్తాయి. శరీరంలో తగినంత కాపర్ లేకపోతే ఒక వ్యక్తి ఎముకల వ్యాధి బారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

* గుండెకు ఆరోగ్యం..

రాగి గుండెకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా హృదయానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. రాగి రక్తపోటు సమస్యలను దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల, కాపర్ బాటిల్స్ లో నీరు త్రాగితే అది మీ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని గుర్తించుకోండి.