Yoga Asanas మోకాళ్ల నొప్పి తగ్గించే 5 యోగాసనాలు

మనం ప్రతిరోజు (Every Day) ఎక్కువగా వాడే శరీర అవయవాలలో మోకాలు ఒకటి. నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు,

మనం ప్రతిరోజు ఎక్కువగా వాడే శరీర అవయవాలలో మోకాలు ఒకటి. నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మన మోకాలు చాలా ఒత్తిడిని భరిస్తుంది. అన్ని వయసుల వారు మోకాలి నొప్పికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎముకల్లో గట్టిదనం లేకపోవడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో క్షీణత వల్ల కూడా మోకాలి నొప్పి వస్తుంది. ఊబకాయం, స్నాయువు చిరిగిపోవడం, గాయం, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య పరిస్థితులు ఇది వచ్చేలా చేస్తాయి. మోకాలి నొప్పి నుంచి బయటపడేందుకు వ్యాయామం మంచి ప్రత్యామ్నాయం. యోగాతో (Yoga) మోకాలి నొప్పిని ఎలా తగ్గించుకోవాలో హీరోయిన్లు ఆలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్ ల యోగా ట్రైనర్ అన్షుక పర్వానీ చెబుతున్నారు.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

“రోజూ యోగా చేయడం వల్ల మోకాలి కండరాలకు బలం వస్తుంది. ఈ మార్పు కీళ్ల కదలికలను సులభతరం చేస్తుంది. మోకాలి గాయాల అవకాశాలను తగ్గిస్తుంది” అని అన్షుక పర్వానీ తెలిపారు. “ఎవరైనా ఇప్పటికే మోకాలి గాయం కలిగి ఉంటే లేదా మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే.. యోగా (Yoga) చేసే ముందు డాక్టర్ లేదా ఫిజియో థెరపిస్ట్‌ని సంప్రదించడం మంచిది” అని ఆమె సూచించారు. అన్షుక పర్వానీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం మోకాలి నొప్పికి 5 యోగా (Yoga) భంగిమలను ట్రై చేయొచ్చు.

కుర్చీ పోజ్

కుర్చీ పోజ్ ను “ఉత్కటాసన” అని కూడా పిలుస్తారు. ఇది కండరాలకు బలం ఇచ్చే ఆసనం. ఈ ఆస‌నాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేయాల్సి ఉంటుంది.

  1. ముందుగా నేలపై చాప వేసి దాని మీద నిల‌బ‌డాలి. మోకాళ్ల మీద గోడ కుర్చీ వేసిన‌ట్లు వంగాలి. త‌రువాత చేతుల‌ను పైకెత్తి ఎదురుగా చూడాలి. ఛాతి భాగాన్ని కొద్దిగా ముందుకు వంచాలి.
  2. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. 15 సెకన్ల పాటు ఈ పోజ్ ను చేయొచ్చు. క్రమంగా ఈ టైంను 2 నిమిషాల వరకు పెంచొచ్చు.
  3. యోగా అనేది నెమ్మదిగా సాగే ప్రక్రియ, కాబట్టి నిదానంగా మరియు స్థిరంగా ఉండండి.

ట్రీ పోజ్

ట్రీ పోజ్ లేదా వృక్షాసనం చేయడం వల్ల మన బాడీలో బ్యాలెన్స్ మెరుగవుతుంది. చాలా సింపుల్ గా నిలబడి చేయగలిగే యోగా భంగిమలలో ఇది ఒకటి. ఈ యోగాసనం కాళ్లకు బలం ఇస్తుంది.

  1. కాలి, పాదాలు, మోకాళ్లతో నిటారుగా నిలబడి ప్రారంభించండి. మీ అరచేతులను కలిసి దగ్గరకు తీసుకురండి. మీ కళ్ళతో ఫోకస్ పాయింట్‌ను కనుగొనండి.
  2. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, మీ బరువును ఎడమ పాదం వైపుకు మార్చండి. మీ కుడి మోకాలిని పక్కకు తిప్పండి.మీ కుడి మడమను ఎడమ చీలమండపై ఉంచండి. మీ కాలి వేళ్లను నేలపై ఉంచండి.
  3. మీరు సమతుల్యతతో ఉన్నట్లయితే, మీ కుడి పాదాన్ని పైకి లేపడానికి ప్రయత్నించండి లేదా మీ లోపలి తొడపైకి నొక్కడానికి మీ పాదాన్ని పైకి తీసుకురండి. ఆకాశం వరకు చేరుకోవడం ద్వారా మీ చేతులను నెమ్మదిగా పైకి తీసుకురండి. మీరు మీ చేతులను మీ తలపైకి తీసుకురావచ్చు లేదా వాటిని వేరుగా ఉంచవచ్చు. మూడు నుండి పది నెమ్మదిగా, లోతైన శ్వాసలు లేదా మీరు చేయగలిగినంత వరకు బ్యాలెన్స్ చేయండి.

వారియర్ III పోజ్

యోగా అనేది నిలబడి చేసే యోగా పోజ్ లలో ఒకటి. దీన్ని “వీర భద్రాసన III” అని కూడా పిలుస్తారు. ఈ భంగిమ శరీరానికి బలమైన పునాదిని నిర్మించడానికి గొప్పదిగా పరిగణించబడుతుంది. ఈ ఆసనం కాళ్ళకీ, భుజాలకీ బలాన్నివ్వడమే కాక మీ ఏకాగ్రత ని కూడా పెంచుతుంది. ఈ ఆసనంలో ఎంత సేపు ఉంటే రిజల్ట్ అంత బావుంటుంది. ఈ ఆసనం వేస్తున్నప్పుడు పొట్ట కండరాలు లోపలికి అంటే ఫ్లాట్ టమ్మీ మీ సొంతం అవుతుంది.

ఆవు ముఖం పోజ్

ఆవు ముఖ భంగిమ దీన్ని గోముఖాసనం అని పిలుస్తారు.  ఇది మోకాలు, తొడలకు మంచిది. రోజూ ఉదయాన్నే దీన్ని చేయడం వల్ల అనేక నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తొడకండరాలు బలపడతాయి. కాళ్లు దృఢంగా మారతాయి. భుజాల నొప్పులు ఉంటే అవి తొలగిపోతాయి. వెన్నెముక పటిష్టమవుతుంది. వెన్ను నొప్పి తగ్గుతుంది. పొట్ట భాగంలో అదనపు కొవ్వు తగ్గుతుంది.

  1. ముందుగా కింద కూర్చొని పద్మాసనం వేయాలి. తర్వాత కుడికాలిని ఎడమ కాలు మీదుగా పెట్టాలి. ఎడమకాలిని వెనక్కి జరిపి కుడి పిరుదు కిందకు వచ్చేలా చేయాలి. ఈ సమయంలో మీ వెన్నెముక నిటారుగా ఉండాలి.
  2. ఆ తర్వాత మీ కుడిచేయిని పైకి తీసుకెళ్లి.. మీ తల వెనకకు వంచాలి. మీ ఎడమ చేయిని కింది నుంచి వెనక్కి తీసుకెళ్లి.. వెన్నెముక భాగంలో కుడిచేయిని పట్టుకోవాలి.
  3. కొద్దిసేపు మీ శరీరం ఈ పొజిషన్ లోనే ఉండాలి. తర్వాత ఎడమ చేయి పైనుంచి, కుడి చేయి కింది నుంచి ఉంచి దీనిని రిపీట్ చేయాలి.

బటర్ ఫ్లై పోజ్

బటర్ ఫ్లై పోజ్ యోగ మీ ఉదరం మరియు తొడల మీద బాగా పనిచేస్తుంది. మీరు అందంగా, ఆకర్షనీయంగా ఉండే సన్నని కాళ్ళు పొందడానికి ఈ యోగా ఆసనం చాలా బాగా దోహదం చేస్తుంది. ఇందులో సీతాకోకచిలుక రెక్కల వలె మీ కాళ్ళను ఆడించడం అవసరం.  ఇది మోకాలి కదలికను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. మోకాలి నొప్పి ఉన్నవాళ్లు ఈ యోగా భంగిమను ట్రై చేయొచ్చు. ఈ పోజ్ మన లోపలి తొడ, పెల్విక్ ఫ్లోర్‌ లను సాగదీస్తుంది. బాడీలోని పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

  1. ముందుగా.. కింద కూర్చోవాలి. తర్వాత రెండు పాదాలను కలిపి పట్టుకోవాలి.
  2. మీ వీపును నిటారుగా ఉంచి.. పాదాలను చేతితో పట్టుకొని. సీతాకోక చిలుక రెక్కల మాదిరి ఆడిస్తూ ఉండాలి.

ఎవరీ అన్షుక పర్వాణి..?

అన్షుక పర్వాణి కరీనా కపూర్‌తో పాటు అలియా భ‌ట్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, అన‌న్య పాండే వంటి వారికి ఫిజికల్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. హీరోయిన్లతో కలిసి చేసే యోగా (Yoga) సెషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్‌ చేయడంతో అన్షుకకు భారీగా ఫాలోవర్స్‌ పెరిగారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ఈ ఆసనాలను ట్రై చేయండి..

Also Read:  Coimbatore: కోయంబత్తూరులో మహిళను తొక్కి చంపిన అడవి ఏనుగు !