Site icon HashtagU Telugu

Addiction: వ్యసనాలు వదిలించుకునే 5 మార్గాలివీ

Whatsapp Image 2023 01 31 At 20.32.18

Whatsapp Image 2023 01 31 At 20.32.18

Addiction: కొందరికి స్మోకింగ్ చేయడం ఒక వ్యసనం..

కొందరికి ఆల్కహాల్ డ్రింక్ చేయడం ఒక వ్యసనం..

కొందరికి పోర్న్ వీడియోలు చూడటం ఒక వ్యసనం..

కొందరికి పేకాట ఆడటం, ఆన్ లైన్ జూదాలు కాయడం, బెట్టింగ్ పెట్టడం వంటి వ్యసనాలు ఉంటాయి. ఆన్ లైన్ జూదాల యాప్ లు ఇటీవల కాలంలో ఎంతోమందిని తమ బానిసలుగా మార్చుకుంటున్నాయి. ఈజీ మనీ కోసం ఎంతోమంది ఆన్ లైన్ జూదాలు కాసి మోసపోతున్నారు.
ఇలాంటివి ఒత్తిడిని పెంచి మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చివరకు డిప్రెషన్ లోకి నెట్టేస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండేందుకు, దూరం అయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. ఇటువంటి వ్యసనాల నుంచి బయట పడటానికి మీకు ఉపయోగపడే 5 వ్యూహాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* సంకల్పమే పునాది

ఏ వ్యసనాన్ని వదలాలన్నా మొదట
కావాల్సింది బలమైన సంకల్పం. మీరు సంకల్పం చేసుకోండి. మీకున్న వ్యసనాన్ని వదిలేందుకు మైండ్ లో డిసైడ్ కండి. ఇదే మీ జీవితంలో మార్పును తీసుకు వస్తుంది. మీకు నిబద్ధత, అంకితభావం ఉంటే సంకల్పం చేసుకోండి. వ్యసనాన్ని ఎలా వదలాలి ? వ్యసనం వదలడం
వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ? ఈ క్రమంలో మీకు ఏ వనరులు అవసరమవుతాయి ? అనే దాని గురించి బాగా ఆలోచించండి. ఇది మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది.

* మీ పరిసరాల్లో మార్పులు చేసుకోండి

వ్యసనానికి దూరమయ్యేలా చేసే వాతావరణాన్ని, పరిసరాలను, సంబంధాలను సృష్టించుకునే బాధ్యత మీదే. ఉదాహరణకు మీరు డ్రగ్స్ లేదా ఆల్కహాల్‌కు బానిసలైతే.. వాటిలో మునిగిపోయే వ్యక్తులతో మీరు కలవడాన్ని ఆపేయండి. మీకు ఇంటర్నెట్‌లో ఎక్కువ పోర్న్ కంటెంట్‌ను చూసే అలవాటు ఉన్నట్లయితే, మీ ఫోన్ లో అలాంటి యాప్స్, గాడ్జెట్స్ తీసేయండి. అలాంటి వెబ్ సైట్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేయండి. ఆ విధంగా మీ ఇంటర్నెట్ బ్రౌజర్ లో సెట్టింగ్స్ చేసుకోండి.

* ప్రొడక్టివ్ వర్క్స్ లో బిజీగా ఉండండి

వ్యసనాన్ని అధిగమించే ప్రక్రియలో మీరు తప్పనిసరిగా చేయవలసిన ఒక విషయం ఏమిటంటే.. బిజీగా ఉండటం. మీరు ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు.. వ్యసనం గురించి ఆలోచించడం తగ్గిస్తారు.  ఉదాహరణకు మీకు తినే అలవాటు ఉన్నట్లయితే.. వంట చేయడం అనేది బిజీ వర్క్ కాదు. దానికి బదులుగా మీరు జిమ్‌కు వెళ్లవచ్చు.

* సపోర్ట్ నెట్‌వర్క్‌ని సృష్టించండి

వ్యసనాలపై విజయం సాధించేలా మీకు నైతిక మద్దతు ఇవ్వగల మీ ప్రియమైనవారి సహాయం తీసుకోండి. మీరు బలహీనంగా పడిపోయినప్పుడల్లా, పరధ్యానంలోకి వచ్చినప్పుడల్లా లేదా మీ వ్యామోహాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి నప్పుడు వారు మిమ్మల్ని అలర్ట్ చేస్తారు.ఇందుకు అదనంగా, వారు స్వంత ఆలోచనలు, వ్యూహాలతో మీ వైద్యానికి విలువను జోడిస్తారు.

* నమ్మకంతో ఉండండి.. ఆశను కోల్పోకండి

వ్యసనాలను వదులుకోవడానికి మీకు మీపై నమ్మకం ఉండాలి. ఆశను కోల్పోవద్దు. వ్యసనానికి దూరమయ్యే క్రమంలో  కొన్ని బలహీన సందర్భాలు వస్తాయి.
మీరు మీ కృషిని విశ్వసిస్తే.. ఈ ప్రక్రియకు ఏదీ ఆటంకం కలిగించదు. మీ వ్యసనాలను పోగొట్టుకోండి. కానీ వాటి బారి నుంచి బయటపడగలననే ఆశను కాదు.