Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన అద్భుతమైన తెలివితేటలు, వ్యూహాల ఆధారంగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో సహాయం చేసి, చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా తీర్చిదిద్దారు. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో (Chanakya Niti) ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడిస్తూ.. భార్యకు సంబంధించిన ఐదు విషయాలను భర్తలు ఎవరికీ చెప్పకూడదని సూచించారు.
జీవితం సుఖశాంతులతో ఎలా ఉండాలి?
భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, రాజకీయ వ్యూహకర్త అయిన ఆచార్య చాణక్యుడు నంద వంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో సహాయపడ్డారు. ఆయన తన జ్ఞానం, అనుభవం ఆధారంగా రచించిన చాణక్య నీతి నేటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. చాణక్య నీతిలో ఆయన రాజకీయం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రవర్తన వంటి జీవితంలోని ప్రతి అంశం గురించి లోతుగా చర్చించారు. ముఖ్యంగా గృహస్థ జీవితానికి సంబంధించి కొన్ని రహస్యాలను ఆయన వెల్లడించారు. వాటిని పాటించడం ద్వారా జీవితం సుఖశాంతులతో నిండి ఉంటుందని పేర్కొన్నారు.
భార్యకు సంబంధించిన ఈ విషయాలు చెప్పకూడదు
భార్యకు సంబంధించిన ఈ ఐదు విషయాలను తల్లిదండ్రులు లేదా మరెవరైనా సరే ఎవరికీ చెప్పకూడదు. ఈ విషయాలను ఎవరికైనా చెబితే మీ జీవితం నరకంగా మారుతుందని ఆచార్య చాణక్యుడు హెచ్చరించారు. భర్తలు తమ భార్యల గురించి అస్సలు మర్చిపోయి కూడా ఎవరికీ చెప్పకూడని ఆ ఐదు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. మొదటిరోజు టీమిండియాదే!
భార్య కుటుంబ రహస్యాలను ఎప్పుడూ చెప్పవద్దు
భార్యాభర్తల బంధం ఎంత బలంగా ఉంటే గృహస్థ ఆశ్రమంలో అంత సుఖశాంతులు ఉంటాయి. భార్య తన భర్త కుటుంబాన్ని గౌరవించాల్సిన ధర్మం ఉన్నట్లే, భర్త కూడా తన భార్య కుటుంబాన్ని గౌరవించాలి. మీ భార్య కుటుంబానికి సంబంధించిన రహస్యాలను ఎప్పుడూ ఇతరులకు చెప్పకూడదు. ఈ విషయాలను ఇతరులకు చెబితే మీ ఇద్దరి మధ్య విశ్వాసం లోపిస్తుంది. ఇది గృహస్థ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు.
భార్య చెడు అలవాట్ల గురించి మర్చిపోయి కూడా ప్రస్తావించవద్దు
భర్త తన భార్య చెడు అలవాట్లను లేదా లోపాలను ఎప్పుడూ ఇతరులతో ప్రస్తావించకూడదు. ప్రతి దంపతుల మధ్య ఇంట్లో చిన్న చిన్న గొడవలు సర్వసాధారణమే. కానీ చాణక్యుడి ప్రకారం.. ఈ విషయాలను బయట మాట్లాడితే భార్యకు మాత్రమే కాదు, భర్తకు కూడా అప్రతిష్ట కలుగుతుంది. దీనివల్ల కుటుంబం పునాది బలహీనపడుతుంది. వారిద్దరి మధ్య ప్రేమ తగ్గుతుంది. అంతేకాక ఈ విషయాలు ఇంటి నుండి బయటకు వెళితే, దంపతులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా పరువు నష్టం కలుగుతుంది.
భార్య శారీరక బలహీనత గురించి చెప్పవద్దు
భర్తలు మర్చిపోయి కూడా తమ భార్య శారీరక బలహీనత గురించి ఎవరికీ చెప్పకూడదు. చాణక్యుడు చెప్పినట్లుగా ఏ పురుషుడు కూడా తన భార్య స్వభావం, ఆరోగ్యం, సహజమైన బలహీనత లేదా అలవాట్ల గురించి ఇతరులతో చర్చించకూడదు. ఇలా చేయడం వల్ల భార్య ప్రతిష్ట తగ్గడంతో పాటు, ఇంటి గౌరవం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మీరు మీ భార్య అనారోగ్యాలు లేదా శారీరక బలహీనత గురించి బయటి వ్యక్తితో మాట్లాడినప్పుడు వారు దానిని పూర్తిగా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ ఇంటికి అపకీర్తి కలగవచ్చు.
భార్య గత సంబంధాల గురించి మాట్లాడకండి
ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. ఆ గతాన్ని భవిష్యత్తులో ఉపయోగించకుండా ముందుకు సాగాలి. ప్రపంచంలో మీ భార్య గత సంబంధాల గురించి మాట్లాడటం వలన ఆమెకు మాత్రమే కాదు మీకు, మీ కుటుంబానికి కూడా అప్రతిష్ట కలుగుతుంది. భార్య గతం ఏదైనా అప్రియమైన సంఘటనకు సంబంధించినదైతే భర్త అటువంటి విషయాలను ఇతరులతో చర్చించకూడదు.
