5 Indoor Plants for Happiness: ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచితే ఎనర్జీ, హ్యాపీనెస్..ఏ దిక్కులో పెట్టాలంటే..!!

ఇంట్లో ఈ 5 మొక్కలను పెంచితే ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ సిద్ధిస్తాయని అంటారు

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 08:15 AM IST

ఇంట్లో ఈ 5 మొక్కలను పెంచితే ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ సిద్ధిస్తాయని అంటారు. ఈ మొక్కలు బోలెడంత ఆక్సిజన్ ఇస్తూ అడ్డమైన రోగాల్నీ దూరం చేస్తాయి. అందుకే ఇళ్లలో ఏవి ఉన్నా లేకపోయినా… ఇలాంటి మొక్కలు తప్పక ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఇంకొన్ని మొక్కలు ఇంటి నుంచి నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపేస్తాయి. కుటుంబంలో ఆనందం, మనశ్శాంతిని తెస్తాయి. ఆ మ్యాజికల్ ప్లాంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* Money Plant

చాలా మంది మనీ ప్లాంట్‌ను ఇళ్లలో పెంచుకుంటారు. ఇది డైరెక్టుగా డబ్బును మనకు ఇవ్వదు. కానీ ఇది పగలు, రాత్రి నిరంతరం ఆక్సిజన్ ఇస్తుంది. ఫలితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. అందువల్లే దీన్ని మనీ ప్లాంట్ అంటారు. దీనికి ఎక్కువగా నీరు కూడా అవసరం ఉండదు. ఇంటి లోపల కూడా హాయిగా పెరుగుతుంది. దీన్ని ఇంటి ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి.

* Lucky Bamboo

భారీ వెదురు చెట్లను మనం చూస్తూనే ఉంటాం. ఇవి అలాంటివే చిన్న వెదురు చెట్లు. ఇవి ఇంతే సైజ్ ఉంటాయి. ఇళ్లు, ఆఫీసులు ఎక్కడైనా వీటిని పెంచుకోవచ్చు. వీటిని లక్కీ బాంబూ అని ఎందుకంటారంటే… ఈ చెట్టు ఉన్న ఇంటికి అదృష్టం పట్టుకుంటుందని ఓ నమ్మకం. ఈ చెట్లను గుంపుగానే బిగించి ఉంచాలి. అలాగే వీటి వేర్లు ఎప్పుడూ నీటిలోనే ఉండాలి. దీన్ని ఇంటి ఆగ్నేయ దిశలో పెట్టాలి.

* Snake Plant

స్నేక్ ప్లాంట్ గాలిని క్లీన్ చేస్తుంది. మీ ఇల్లు గనుక రోడ్డు పక్కన ఉంటే… మీరు ఇంట్లో దీన్ని ఉంచుకోవడం మేలు. అంతే కాదు… దీన్ని పెంచుకునే వాళ్లకు ఆర్థికంగా అంతా కలిసొస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఇది ఇంటి ఆగ్నేయ దిశలో పెట్టాలి.

* లిల్లీ

ఇంట్లో పెంచుకునే అతి ముఖ్యమైన మొక్కల్లో లిల్లీ ఒకటి. ఇది ఇంటికి ఆకర్షణను తీసుకొస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఇంటికి కళ వస్తుంది. లిల్లీ మొక్క ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నవారికి మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. లిల్లీ మొక్కను తూర్పు దిక్కులో ఉంచాలి. అయితే సంపద, శ్రేయస్సు కావాలనుకున్న వారు దీన్ని నైరుతి దిక్కులో ఉంచుకోవచ్చు.

* తులసిచెట్టు

వాస్తు శాస్త్రంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీరు ఈశాన్య దిశలో దీన్ని నాటవచ్చు. అలాగే రోజూ నీళ్లు పోయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో రాహువు సమస్య తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద, శ్రేయస్సు యొక్క చిహ్నం. కాబట్టి తులసి మొక్కను ఇంట్లో ఈశాన్య మూలలో నాటాలి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో ఇంటికి డబ్బు వస్తుంది.దీన్ని ఇంట్లో ఈశాన్య, తూర్పు దిక్కున పెట్టుకోవచ్చు.

ఇవి రెండు కూడా..

పై ఐదు మొక్కలతో పాటు
Erica Palm మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. చాలా అందంగా ఉండే మొక్క ఇది. ఇంట్లోని ఏ మూల దీన్ని ఉంచినా… ఆ ఇంటికి ఓ అందం వస్తుంది. ప్రతి రోజ ఈ చెట్టు ఇలా మెరుస్తూ… ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మొక్కను ఇళ్లలో పెంచుకునేవారికి పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయానీ, సంతోషం, అభివృద్ధి సాధిసారని చెబుతున్నారు. ఇక Jade Plant ను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు.
ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆనందం, అభివృద్ధీ అన్నీ కలుగుతాయట. ఇది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చిన్నగా ఉంటుంది. ఎక్కువ నీరు అవసరం లేదు. రోజూ దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు.