Fruits: చర్మ సౌందర్యాన్ని పెంచే ఐదు రకాల పండ్లు.. అవేంటో తెలుసా?

పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే డాక్టర్లు తరచూ పండ్లు తీసుకోమని చెబుతూ ఉం

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 08:40 PM IST

పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే డాక్టర్లు తరచూ పండ్లు తీసుకోమని చెబుతూ ఉంటారు. పండ్లు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. పండ్లు అలాగే పండ్ల రసాలు అందాన్ని రెట్టింపు చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. చాలామంది చర్మ సౌందర్యం కోసం ఖరీదైన లోషన్లు, క్రీములను ఎక్కువగా వాడడం వల్ల రసాయనాలతో దుష్ప్రభావం బారిన పడే ప్రమాదం ఉంది. ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే చర్మ సంరక్షణ సులభంగానే సాధ్యపడుతుంది. ఆయా సీజన్లలో లభించే తాజాపండ్లను తినడానికే కాదు చర్మ సౌందర్యం పెంచుకునేందుకు కూడా వాడవచ్చు.

అందులో ముఖ్యంగా ఐదు రకాల పండ్లను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు. మరి ఆ ఐదు రకాల పండ్లు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. అందులో మొదటిది అరటిపండు. ఈ పండు ఏడాది పొడవునా మనకు లభిస్తూ ఉంటుంది. ఇందులో ఉంటే ఐరన్, మెగ్నిషియం, పోటాషియం వంటివి చర్మ నిగారింపుకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అరటిపండులో ఏ, బీ, ఈ విటమిన్స్ ఫుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీంతో మీ చర్మం మంచి రంగులోకి మారడానికి అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే తాజా అరటిపండ్లను ఫేసియల్ గా ఉపయోగించవచ్చు.

మరొకపండు నిమ్మకాయ. నిమ్మకాయలు కూడా మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. నిమ్మలో ఉండే విటమిన్ సీ చర్మం అందంగా కావడానికి ఉపయోగపడుంతుంది. ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాస్ వేడి నీళ్లలో నిమ్మ, తేనే కలిపి తాగితే చర్మం నిగనిగలాడుతుంది. చర్మ లోపలి కణాలలోని నల్లటి మచ్చలను, ముడతలను పోగొడతాయి. అలాగే మోచేతులు, నల్లవలయాలు ఉంటే ఇతర ప్రాంతాల్లో నిమ్మతో రుద్దితే చర్మం అందంగా తయారవుతుంది. మరొకపండు యాపిల్. సాధారణమైన చర్మం కలవారికి యాపిల్‌తో చేసిన ఫేస్‌ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది. యాపిల్ పండును చిన్న, చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మిశ్రమాన్ని తయారు చేసుకొని తర్వాత అందులో కాస్త తేనె, రోజ్ వాటర్ కలుపుకొని ఆ మిశ్రమాన్ని మీ చర్మంపై పూయాలి. ఇలా కొన్నిరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే, నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపు రెట్టింపు అవుతుంది.

మరో పండు ఆరెంజ్. ఆరెంజ్ లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. యాపిల్ లాగానే ఇందులో ఉంటే విటమిన్స్ చర్మాన్ని అందంగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఆరెంజ్ పండ్ల తొక్కలను ఎండబెట్టి వాటి ద్వారా తయారు చేసే పొడిని నేచరల్ స్రబ్ గా ఉపయోగించుకోవచ్చు. అందాన్ని రెట్టింపు చేసుకోవడంలో బొప్పాయి కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. చర్మ నిగారింపు కోసం ఈ పండును ఉపయోగించవచ్చు. ఈ పండు రసాన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌గా వేసుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకే కాక, వివిధ చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఇది చక్కగా పని చేస్తుంది. చర్మంలో ఏర్పడే మృత కణాలను, మృత చర్మాన్ని పోగొడుతుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మరొక పండు మామిడి. మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. మామిడి రసం చర్మం మరింత అందంగా తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఉండే విటమిన్ ఏ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ పండులో బీటా కెరోటిన్‌ కూడా పుష్కలంగా ఉండడం వల్ల ఇది చర్మాన్ని పునరుద్ధపరచి, కణాల జీవితకాలాన్ని పెంచుతుంది.