Memory Problems: ఫుడ్స్ తింటే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది

మీ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. దీన్ని  సరైన స్థితిలో ఉంచడానికి తగిన పోషకాహారం అవసరం. కొన్ని ఆహారాలు మీ జ్ఞాపకశక్తికి కూడా ప్రభావితం చేసి, డిమెన్షియాకు దారితీస్తాయి. ఈవిధంగా  మీ జ్ఞాపకశక్తి సమస్యలను మరింత తీవ్రతరం చేసే 5 ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 02:30 PM IST

మీ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. దీన్ని  సరైన స్థితిలో ఉంచడానికి తగిన పోషకాహారం అవసరం. కొన్ని ఆహారాలు మీ జ్ఞాపకశక్తికి కూడా ప్రభావితం చేసి, డిమెన్షియాకు దారితీస్తాయి. ఈవిధంగా  మీ జ్ఞాపకశక్తి సమస్యలను మరింత తీవ్రతరం చేసే 5 ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రైడ్ ఫుడ్స్

సమోసాలు, చేపలు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పకోడాస్, టెంపురా మొదలైన ఆహారాలు మీ మెదడు ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి జ్ఞాపకశక్తి తగ్గేలా చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం..18,080 మంది ఫ్రైడ్ ఫుడ్స్‌ తీసుకున్న వారిలో జ్ఞాపకశక్తి , ఏకాగ్రత సన్నగిల్లింది. ఈ ఆహారాలు శరీరంలో మంటను కలిగిస్తాయి. మీ మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను దెబ్బతీస్తాయి.

శుద్ధి చేసిన రొట్టె, పాస్తా

పాస్తాలు, వైట్ బ్రెడ్ అనేవి ప్రాసెసింగ్ చేసిన ఫుడ్స్. ప్రాసెసింగ్ వల్ల వీటిలోని పోషకాలు తొలగించబడతాయి. అందుకే ఇవి మీ మెదడు హెల్త్ కు ఉపయోగపడవు. వీటిలో ఉండే అధిక గ్లైసెమిక్ పిండి పదార్థాలు.. మీ ఇన్సులిన్, బ్లడ్ షుగర్ స్థాయిలను కూడా పెంచుతాయి. తద్వారా మీ జ్ఞాపకశక్తి, అభిజ్ఞా సామర్థ్యాలను ప్రభావితం చేస్తాయి. వీటికి బదులుగా మీరు మీ ఫుడ్ లో బ్రౌన్ రైస్ పాస్తా లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్‌ని చేర్చుకుంటే బెస్ట్.

వెజిటబుల్ ఆయిల్స్‌

కనోలా ఆయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్‌లో ఇన్‌ఫ్లమేటరీ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. జ్ఞాపకశక్తి మందగించేలా చేస్తాయి. ఫలితంగా అల్జీమర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది మీలో డిప్రెషన్(కుంగుబాటు), మెదడు ఆలోచనలకు సంబంధించిన కాగ్నిటివ్ సమస్యలను ప్రేరేపిస్తుంది. వెజిటబుల్ ఆయిల్స్‌
తీసుకోవడం వల్ల కలిగే మెదడు వాపు వల్ల.. మీరు తరచుగా మానసిక అలసటకు గురి అవుతారు. వెజిటబుల్ ఆయిల్స్‌ కు బదులుగా మెదడు మెమోరీ పవర్ ను పెంచే కొబ్బరి నూనె లేదా పచ్చి ఆలివ్ నూనె తీసుకుంటే బెస్ట్.

జున్ను

జున్నులో పెద్ద మోతాదులో సంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటి వల్ల మీ మెదడులోని నాళాలు మూసుకుపోతాయి. మీ జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. అమెరికన్ చీజ్, మోజారెల్లా స్టిక్స్ వంటి చీజ్‌లు మన శరీరంలో అల్జీమర్స్‌తో సంబంధం ఉన్న ప్రోటీన్‌లను నిర్మిస్తాయి. వీటికి  బదులుగా.. మీరు అవకాడో వంటి మొక్కల ఆధారిత క్రీమ్స్ ను ట్రై చేయొచ్చు. ఇది ఫోలేట్ యొక్క గొప్ప మూలం. దీన్ని తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

మెర్క్యూరీ అధికంగా ఉండే చేప

మెర్క్యురీ అంటే పాదరసం.ఇది మన మెదడులోని నాడులపై ఒక విషంలా పనిచేస్తుంది. ఇది సాధారణంగా జంతువుల కణజాలాలలో ఎక్కువ కాలం నిల్వ అయి ఉంటుంది. షార్క్‌లు, ట్యూనా, కింగ్ మాకేరెల్, టైల్ ఫిష్, స్వోర్డ్ ఫిష్ వంటి సీ ఫుడ్స్ లో అధిక మోతాదులో పాదరసం ఉంటుంది. ఇది మీ మెదడు అభివృద్ధికి అంతరాయం కలిగిస్తుంది. మెడదులోని కణాల భాగాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో, అభివృద్ధి చెందుతున్న పిండాలపై ఇది నెగెటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అధిక పాదరసం ఉండే చేపలను తరచుగా తింటే.. మీ కాలేయం, మూత్రపిండాలపై కూడా నెగెటివ్ ప్రభావం పడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం అవుతుంది.