Sex Dreams: నిద్రలో సెక్స్ కలలు దేనికి సంకేతం..?

ఎవరితో పడితే వారితో, అపరిచిత వ్యక్తులతో సెక్స్ చేసినట్టు అడ్డమైన కలలు వస్తే.. దాని అర్థం ఏమిటి? ఇటువంటి సెక్స్ డ్రీమ్స్ (Sex Dreams)ను అక్షరాలా అర్థం చేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
more sleep, more sex

Sex

మీరు నిద్రలో సెక్స్ కలలను చూస్తున్నారా? ఇటువంటి సెక్స్ డ్రీమ్స్ దేనికి సంకేతం? ఎవరితో పడితే వారితో, అపరిచిత వ్యక్తులతో సెక్స్ చేసినట్టు అడ్డమైన కలలు వస్తే.. దాని అర్థం ఏమిటి ? ఇటువంటి సెక్స్ డ్రీమ్స్ (Sex Dreams)ను అక్షరాలా అర్థం చేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. చాలా సార్లు ఈ కలలు మనం సాధించాలను కునే కోరికలను అద్దం పడతాయి.

■ మాజీతో సెక్స్

సాధారణ సెక్స్ కలలలో మన మాజీ లవర్ కూడా ఒకటి. ఇది జంట మధ్య బంధం పూర్తిగా తెగలేదని సూచిస్తుంది.  సంబంధాలు పూర్తిగా తెగకపోవడం అనేది అటువంటి సెక్స్ కలలకు దారి తీస్తుంది. సెక్స్ అనేది సాన్నిహిత్యం యొక్క అత్యున్నత రూపం అని నమ్ముతారు. మీ మాజీ గురించి ఇంకా కలలు కనడం అంటే మీరు ఇంకా అతని/ఆమెని వదల లేదని సూచిస్తుంది.

■అపరిచితులతో సెక్స్

అపరిచితుడితో సెక్స్ గురించి కలలు కనడం అంటే ఆ అనామకుడి పట్ల మీ ప్రేమను సూచిస్తుంది. తెలియని వాటిని అన్వేషించాలనే కోరిక చాలా మందికి టర్న్-ఆన్‌గా పనిచేస్తుంది. మీరు పబ్లిక్‌లో అపరిచితుల పట్ల ఆకర్షితుల వుతున్నట్లు అనిపిస్తే, మీ నిద్రలో అలాంటి కలలు రావడం చాలా సాధారణం.

■తెలిసిన వారితో సెక్స్

మన జీవితంలో స్నేహితులు, సహోద్యోగుల సమూహాలు ఉంటాయి. వారి పట్ల మన లైంగిక కోరికల గురించి ప్రజలకు ముందుగా చెప్పడానికి మనం తరచుగా భయపడతాము. అందుకే దాని గురించి కలలు కంటాము. తెలిసిన వారితో లైంగిక కలలు కనడం అంటే మీరు ఆ వ్యక్తి పట్ల లైంగికంగా లేదా ప్రేమ పూర్వకంగా భావాలను పెంచుకున్నారని సూచిస్తుంది.

■ప్రముఖులతో సెక్స్

అత్యంత స్పష్టమైన, సాధారణమైన సెక్స్ కలలలో ప్రముఖులు కూడా ఉంటారు. మనం తరచుగా దాని గురించి ఎందుకు కలలు కంటున్నామో అర్థం కాని విషయం. వారి చరిష్మా, ఫిట్ బాడీ, అందం చూసి మనం వారిపై లైంగిక కోరికలను పెంచుకుంటాం. అందుకే వారితో  సెక్స్‌లో పాల్గొనాలని మీరు తరచుగా కలలు కంటారు.  ఇది మీ మానసిక స్థితిని బట్టి కూడా మారవచ్చు.

■ బహిరంగంగా సెక్స్

పబ్లిక్ మధ్యలో అందరూ చూస్తుండగా సెక్స్ చేయాలనే వెర్రి కల కొందరికి ఉంటుంది. ఇటువంటి కలలు సరికాదు. పబ్లిక్ సెక్స్ సరికాదు. సెక్స్ అనేది గుట్టుగా జరగాల్సిన అంశం అని గుర్తుంచుకోవాలి. సెక్స్ ను పబ్లిక్ మధ్య చేయకుండా ప్రతి ఒక్కరు సెల్ఫ్ కంట్రోల్ తో ఉండాలి. ఇలాంటి కలలు రాకుండా మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

  Last Updated: 26 Mar 2023, 02:56 PM IST