Clove Tea : మన వంటింటిలో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. దీనికి ఆయుర్వేదంలోనూ ప్రముఖ స్థానం ఉంది. అన్ని కూరలు, బిర్యానీలు తయారు చేయడానికి.. వాటి రుచిని పెంచడానికి లవంగాలను ఉపయోగిస్తారు. లవంగాలలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. చలికాలంలో లవంగం టీని తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు మంట సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. లవంగం శరీర జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. పంటి నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్‌లాగా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. చిగుళ్ల వాపునూ తగ్గిస్తుంది. లవంగాలలో ఉండే మూలకాలు మన నోటి నుంచి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి.
We’re now on WhatsApp. Click to Join.
లవంగం టీ తయారీ విధానం
- లవంగం టీ తయారీకి పాలను ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు.
- లవంగం టీ చేయడానికి ఒకటిన్నర కప్పు నీటిలో రెండు లవంగాలను బాగా దంచి వేయాలి. గ్యాస్‌పై కొద్దిసేపు మరిగించాలి.
- ఆ తర్వాత టీని ఫిల్టర్ చేసి అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఆ తర్వాత తాగాలి.
- ఈ టీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం.
- లవంగం దాని వేడి ప్రభావం వల్ల కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా(Clove Tea) తాగొద్దు.