Vasthu Tips: సాయంత్రం ఈ పనులు చేస్తున్నారా.. కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే?

సాధారణంగా వాస్తు శాస్త్ర ప్రకారం సాయంత్రం అలాగే ఉదయం పూట కొన్ని రకాల పనులను చేయకూడదు అని చెబుతూ

  • Written By:
  • Publish Date - October 29, 2022 / 07:30 AM IST

సాధారణంగా వాస్తు శాస్త్ర ప్రకారం సాయంత్రం అలాగే ఉదయం పూట కొన్ని రకాల పనులను చేయకూడదు అని చెబుతూ ఉంటారు. అలా మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్ర నిపుణులు సాయంత్రం సమయంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని చెబుతున్నారు. ఇలా సాయంత్రం సమయంలో కొన్ని పొరపాటులను చేయడం వల్ల ఇంట్లో ఉన్న డబ్బులు అంతా పోయి పేదరికం రావడంతో పాటు అనేక రకాల సమస్యలు కూడా వెంటాడుతాయట. మరి సాయంత్రం సమయంలో ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చేందుకు చీపురుని ఉపయోగించకూడదు. అలా అని సాయంత్రం ఇల్లు ఊడవకూడదని కాదు కానీ ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయంలో అనగా సూర్యాస్తమయం తరువాత చీపురుతో ఇంటిని ఊడ్చకుండా ఉంటే మంచిది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఆడవారిని అవమానించ కూడదు. కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసుల్లో వ్యాపార ప్రదేశాలలో ఆడవారిని ఏమీ అనకూడదు. సాయంత్రం సమయంలో ఆడవారిని ఏదైనా అనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

అదేవిధంగా సాయంత్రం సమయంలో నిద్ర పోకూడదు. అలా సాయంత్రం సమయంలో నిద్రపోతే ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం మంచిది కాదు. అదేవిధంగా సాయంత్రం సమయంలో తులసి మొక్కకు నీరు పోయకూడదు. అలాగే తులసి మొక్కను తాకడం ఆకులు పూలు కోయడం లాంటివి కూడా చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా అటువంటి పనులు తెలిసి తెలియక పొరపాటుగా చేసినా కూడా లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్లిపోతుందట.