Twins and Multiples: కవలల పుట్టుక మిస్టరీ ఇదీ..!

కవల పిల్లలు ఎలా పుడతారు ? ఎందుకు పుడతారు ? కొంతమందికే కవలలు ఎందుకు కలుగుతారు ? అనేది ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రపంచ వ్యాప్తంగా 130 మిలియన్ల ట్విన్స్ ఉన్నారని అంచనా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న కవలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 02:25 PM IST

కవల పిల్లలు ఎలా పుడతారు ? ఎందుకు పుడతారు ? కొంతమందికే కవలలు ఎందుకు కలుగుతారు ? అనేది ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రపంచ వ్యాప్తంగా 130 మిలియన్ల ట్విన్స్ ఉన్నారని అంచనా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న కవలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..!

◆ కవలలు అంటే..?

తల్లి గర్భంలో కొన్ని సెకన్ల వ్యవధిలో ఒకరికి మించి పిల్లలు జన్మిస్తే వారిని కవలలు అంటారు. ఇద్దరూ మగ పిల్లలు, ఇద్దరూ ఆడ బిడ్డలు, ఒక ఆడ బిడ్డ, ఒక మగ బిడ్డ.. ఇలా కవలలు ఎలా అయినా కావచ్చు. కవలలు లుక్ లో ఒకేలా ఉంటారు. ఒకే పోలికతో ఉండే ట్విన్స్ ను వైద్య పరిభాషలో ‘మోనోజైగోటిక్ ట్విన్స్’ అని అంటారు. వేర్వేరు పోలికలతో జన్మించిన కవల పిల్లలను ‘డైజైగోటిక్’ ట్విన్స్’ అంటారు. శరీరాలు అతుక్కుని జన్మించే పిల్లలను సయామీ కవలలు అంటారు.

◆ ఇద్దరి కంటే ఎక్కువ కవలలను ఏం అంటారు..?

* ఇద్దరు పిల్లలు ఒకేసారి పుడితే – ట్విన్స్ అంటారు.
* ముగ్గురు కవలలు – ట్రిప్లెట్స్
* నలుగురు కవలలు- క్వాడ్రుపుల్స్
* ఐదుగురు కవలలు- క్విన్ ట్యుప్లెట్స్
* ఆరుగురు కవలలు – సిక్స్ ట్యుప్లెట్స్
* ఏడుగురు కవలలు – సెప్ ట్యుప్లెట్స్
* 8 మంది కవలలు – ఆక్ ట్యుప్లెట్స్
* 9 మంది కవలలు – నాన్ అప్ లెట్స్
* 10 మంది కవలలు – డెక్ అప్ లెట్స్

◆ కవలలు ఎందుకు పుడతారు..?

పురుషల నుంచి విడుదలయ్యే వీర్య కణాలు మహిళల్లోని అండంతో ఫలదీకరణం చెందడం
వల్లే సంతానం కలుగుతుంది. అయితే మహిళ్లలో కొన్నిసార్లు రెండు అండాశయాల నుంచి రెండు అండాలు విడుదల అవు తుంటాయి. ఈ అండాలతో రెండు వీర్య కణాలు కలిస్తే రెండు ఫలదీకరణాలు జరుగుతాయి. ఇందువల్లే కవల పిల్లలు జన్మిస్తారు. ఇలా ఒకటికి మించి మహిళల అండాలు విడుదల అయిన ప్పుడు.. వాటితో అంతే సంఖ్యలో పురుషుల వీర్యకణాలు కలిస్తే ఫలదీకరణ జరుగుతుంది. దీనివల్ల అంత సంఖ్యలో కవలలు జన్మిస్తారు.

◆ కవలలు పుట్టడానికి జీన్స్ కారణమా..?

కవలలకు జన్మనివ్వడంలో జీన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే.. మీ వంశంలో ఇంతకు ముందు ఎవరైనా కవలలకు జన్మనిచ్చి ఉంటే.. మీకూ ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులిద్దరి వంశాల్లో ‘ట్విన్స్ హిస్టరీ’ ఉంటే కవలలకు జన్మనిచ్చే అవకాశం మరింత పెరుగుతుందట. ‘ట్విన్స్ జీన్స్’ ఉన్న మహిళలు.. 30 ఏళ్ల వయసు దాటాక గర్భం ధరిస్తే కవలలు జన్మించే అవకాశం ఇంకాస్త పెరుగుతుందట.

◆ హెవీ వెయిట్.. హెవీ హైట్ మహిళలకు..!

అధిక బరువుండే మహిళలకు, బీఎంఐ 30 కన్నా ఎక్కువున్న మహిళలకు కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువట. వీరిలో ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయట. అందుకే గర్భధారణ సమయంలో రెండు అండాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంటుంది. 5.5 అడుగుల కంటే పొడవున్న మహిళలు కవలలకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువట.

◆ ఒకసారి ట్విన్స్ కలిగితే.. రెండోసారి?

ఒకసారి కవలలకు జన్మినిచ్చిన మహిళకు మరో కాన్పులో కూడా కవలలు పుట్టే ఛాన్స్ ఎక్కువే. ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరికి ఈ అవకాశం ఎక్కువట. ఐతే.. మొదటి సారి జన్మించే కవలలు ఒకేలా ఉన్నప్పటికీ.. రెండో సారి జన్మించిన ట్విన్స్ వేర్వేరు రూపాల్లో ఉండే అవకాశాలే ఎక్కువని చెబుతారు.

◆ ట్విన్స్ పుట్టడానికి ఇతర కారణాలు

★పెళ్లయిన చాలా ఏళ్ల వరకు పిల్లలు పుట్టని మహిళలు వైద్యులను సంప్రదించి కొన్ని మందులు వాడుతుంటారు. ఇటువంటి సమయంలో ఆ మందుల ప్రభావం వల్ల కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలై ట్విన్స్ కలుగుతారు.

★ పాల ఉత్పత్తులు, చేపలు వంటి పోషకాలుండే ఆహారం తీసుకునే వారికి ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువని ఒక రీసెర్చ్ లో తేలింది.

★ గర్భధారణ సమయంలో మల్టీ విటమిన్ల ట్యాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను అధికంగా తీసుకున్న వారిలో ఎక్కువ మందికి కవల పిల్లలే పుట్టారని ఒక రీసెర్చ్ లో వెల్లడైంది.