1 Minute omelette : గుడ్డు లేకుండానే ఆమ్లెట్ తయారీ.. ఈ ప్రోడక్ట్ గురించి తెలుసా?

కేరళకు(Kerala) సంబంధించిన వ్యక్తి ఇన్‌స్టంట్ ఆమ్లెట్ రెసిపీను తయారుచేశారు. కేరళలోని రామనట్టుకరలో నివసించే అర్జున్ అనే వ్యక్తి దీనిని రూపొందించాడు.

Published By: HashtagU Telugu Desk
1 Minute Omelette Recipe Product omelette without Egg

1 Minute Omelette Recipe Product omelette without Egg

ప్రస్తుతం అందరూ రోజూ ఎదో ఒకటి తిన్నామా లేదా తొందరగా అయ్యే టిఫిన్లు తింటున్నారు. చాలా మంది ఈ కాలంలో టిఫిన్ల రూపంలో బ్రెడ్ ఆమ్లెట్, ఆమ్లెట్(omelette) వంటివి తింటూ ఉంటారు. అయితే గుడ్డు(Egg)ను పగలగొట్టడం అది కింద మీద పడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకొక గ్లాస్ లో గుడ్డును కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా పని లేకుండా డైరెక్ట్ గా ఆమ్లెట్ తయారుచేసుకోవచ్చు.

కేరళకు(Kerala) సంబంధించిన వ్యక్తి ఇన్‌స్టంట్ ఆమ్లెట్ రెసిపీను తయారుచేశారు. కేరళలోని రామనట్టుకరలో నివసించే అర్జున్ అనే వ్యక్తి దీనిని రూపొందించాడు. ఇప్పుడు దీనిని మార్కెట్ లో కూడా అందుబాటులో ఉంచారు. ఇది చిన్న ప్యాకెట్ ధర ఐదు రూపాయల నుండి వంద రూపాయల వరకు ఉంటుంది. ఈ ప్యాకెట్ నాలుగు నెలల వరకు నిలువ ఉంటుంది. కానీ అసలు అర్జున్ ఎందుకు దీనిని తయారుచేశాడో తెలుసుకుందాము.

అర్జున్ తన కూతురు కోసం దీనిని తయారుచేసాడు. అర్జున్ తన కూతురు ధన్ శివ కోసం దీనిని రూపొందించాడు. గుడ్డు లేకుండా దీనిని తయారుచేయడానికి అర్జున్ మూడు సంవత్సరాలు కొంత డబ్బును ఖర్చుపెట్టి అనేక ప్రయోగాలను చేసి చివరకు అనుకున్నది సాధించారు. అదే గుడ్డు లేకుండా ఆమ్లెట్ తయారుచేసే రెసిపీ కనుగొన్నారు. దానిని అందరూ ఓకే అనుకున్నాక మార్కెట్ లో విడుదల చేశారు.

అర్జున్ రెండు కోట్ల రూపాయలతో కండొట్టి వజ్జయూర్ లో ‘ధన్స్ డ్యూరబుల్’ అనే కంపెనీతో క్వీన్స్ ఇన్‌స్టా(Queens Insta) బ్రాండ్ పేరుతో దీనిని మార్కెట్ లో విడుదల చేశారు. ఇంకా దీనిలో కిడ్స్ ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, వైట్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, స్వీట్ ఆమ్లెట్ బార్ స్నాక్స్ అనే పేర్లతో కొత్త ఫ్లేవర్ లను విడుదల చేశారు. 2021లో అర్జున్ 12 మందికి ఉపాధిని కల్పిస్తూ కంపెనీని మొదలుపెట్టారు.

 

Also Read : Cow: గోమాతకు నానబెట్టి ఉలవలను తినిపిస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం?

  Last Updated: 10 Aug 2023, 09:29 PM IST