ఫుడ్ డెలివరీ సేవలలో ప్రముఖమైన జొమాటో (Zomato ) వినియోగదారులపై అదనపు ఛార్జీల భారం మోపడం మొదలుపెట్టింది. నష్టాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం, వినియోగదారులలో అసంతృప్తిని కలిగిస్తోంది. ఇప్పటికే భోజన ధరలు పెరుగుతున్న తరుణంలో, అదనపు డెలివరీ ఛార్జీలు విధించడం వల్ల చిన్న మొత్తాల ఆర్డర్లకు వినియోగదారులు భయపడుతున్నారు.
Jaggareddy : జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు -జహీరాబాద్ గడ్డపై సీఎం రేవంత్ ప్రకటన
ప్రస్తుత విధానంలో రెస్టారెంట్ నుండి కస్టమర్ అడ్రస్ వరకు 4-6 కిలోమీటర్ల దూరం ఉంటే, ఆర్డర్ విలువ రూ.150 దాటితే రూ.15 చెల్లించాల్సి వస్తోంది. అదే దూరం 6 కిలోమీటర్లకు పైగా అయితే, ఆర్డర్ విలువ ఎంత ఉన్నా నగరాన్ని బట్టి రూ.25 నుండి రూ.35 వరకు డెలివరీ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు కోవిడ్ మహమ్మారి వరకు 5 కిలోమీటర్ల పరిధిలో డెలివరీకి ఎలాంటి ఛార్జీలు ఉండేవి కావు. కానీ కరోనా అనంతరం వ్యయాలు పెరిగిన నేపథ్యంలో జొమాటో డెలివరీ ఫీజును ప్రవేశపెట్టింది.
ఈ మార్పులు సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తున్నాయి. చిన్న ఆర్డర్లపైనా ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి రావడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. స్థానిక రెస్టారెంట్ల నుంచి స్వయంగా తీసుకెళ్లే ఆప్షన్లు, ఇతర డెలివరీ యాప్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. జొమాటో అయితే తన వ్యయాలను తగ్గించుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినప్పటికీ, దీని ప్రభావం వినియోగదారుల విశ్వాసంపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.