Site icon HashtagU Telugu

Ustad Zakir Hussain : సంగీతంలో విప్ల‌వం తీసుకువ‌చ్చిన ఓ జ్ఞాని జ‌కీర్ : ప్రధాని మోడీ

Zakir, a genius who brought a revolution in music: Prime Minister Modi

Zakir, a genius who brought a revolution in music: Prime Minister Modi

Ustad Zakir Hussain: ప్ర‌ధాని మోడీ తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్ మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. లెజెండ‌రీ మ్యాస్ట్రో జ‌కీర్ హుస్సేన్ మృతి బాధ‌కు గురి చేసింద‌న్నారు. భార‌త సంప్ర‌దాయ సంగీతంలో విప్ల‌వం తీసుకువ‌చ్చిన ఓ జ్ఞానిగా ఉస్తాద్ జ‌కీర్ హుస్సేన్‌ను గుర్తు చేసుకుంటామ‌న్నారు. త‌బ‌లా వాయిద్యాన్ని విశ్వ‌వ్యాప్తం చేసిన సంగీత క‌ళాకారుడు అని పేర్కొన్నారు. త‌న త‌బ‌లా మ్యూజిక్‌తో ల‌క్ష‌లాది మంది అభిమానుల్ని ఆక‌ట్టుకున్న‌ట్లు ప్రధాని మోడీ చెప్పారు.

జాకీర్ కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, ప్ర‌పంచ సంగీత లోకానికి సంతాపం చెబుతున్న‌ట్లు ప్రధాని మోడీ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. త‌న త‌బ‌లా మ్యూజిక్‌తో ల‌క్ష‌లాది మంది అభిమానుల్ని ఆక‌ట్టుకున్న‌ట్లు చెప్పారు. భార‌తీయ క్లాసిక‌ల్ సంప్ర‌దాయాల‌ను.. గ్లోబ‌ల్ మ్యూజిక్ తో స‌మ్మిళితం చేసి.. సాంస్కృతిక ఐక‌మ‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలిపారు. జాకీర్ హుస్సేన్ ఇచ్చిన ప్ర‌ద‌ర్శ‌న‌లు.. ర‌స‌భ‌రిమైన బాణీలు.. రాబోయే త‌రాల‌కు చెందిన మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ప్రేరేపిస్తూనే ఉంటాయ‌ని ప్రధాని మోడి అన్నారు.

కాగా, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ (73) కన్నుమూసిన విషయం తెలిసిందే. బ్లడ్ ప్రెషర్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 వారాల క్రితం శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. తబలా మ్యాస్ట్రోగా పేరొందిన జాకీర్‌ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. తన తండ్రి అల్లారఖా బాటలోనే జాకీర్‌హుస్సేన్ నడిచాడు. చిన్నతనం నుంచే తబలా నేర్చుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Read Also:  Deval Verma : స్క్రాప్ మెటల్‌ను ప్రపంచ కళగా మలచిన ఇంద్రపూరి యువకుడు దేవల్ వర్మ