Site icon HashtagU Telugu

Sharad Pawar : శరద్‌ పవార్‌కి Z ప్లస్‌ కేటగిరీ భద్రత..

Z Plus category security for Sharad Pawar

Z Plus category security for Sharad Pawar

Sharad Pawar: కేంద్ర ప్రభుత్వం ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్‌ శరద్‌ పవార్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత(Z Plus category security)ను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం అయిన 83 ఏళ్ల వయస్సున్న ఆయనకు జెడ్‌ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించింది. పలువురు వీఐపీల భద్రతను కేంద్ర భద్రతా సంస్థలు బుధవారం సమీక్షించాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్‌ భద్రతను జెడ్‌ ప్లస్‌కు పొడిగించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 55 మంది సాయుధ సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని ఆయన భద్రతకు కేటాయించాలని పేర్కొంది. సీఆర్‌పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ వింగ్ ద్వారా ఈ మేరకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖ బుధవారం సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join.

శరద్ పవార్ మన దేశంలో అత్యంత ఎత్తైన రాజకీయ నాయకుడు. అతని భద్రతకు అన్ని వేళలా ప్రాధాన్యత ఇవ్వాలి అని క్రాస్టో అన్నాడు.  ఈ పనిని చేపట్టేందుకు ఇప్పటికే సీఆర్పీఎఫ్ బృందం మహారాష్ట్రలో ఉందని అధికారులు తెలిపారు. VIP భద్రతా కవర్ వర్గీకరణలు Z, Y+, Y మరియు X తర్వాత అత్యధిక Z+ నుండి ప్రారంభమవుతాయి. కాగా, ప్రముఖ వ్యక్తులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) ద్వారా భద్రత కల్పిస్తారు. వారి స్థాయి, వారికి వాటిల్లే ముప్పును అనుసరించి వీఐపీ భద్రతా కవర్‌ను జెడ్‌, వై, ఎక్స్‌ కేటగిరీలుగా వర్గీకరిస్తారు. వీవీఐపీలకు అత్యధిక సెక్యూరిటీ కింద జెడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తారు.

Read Also: Hema Committee : హేమా కమిటీ నివేదికపై విజయన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేరళ హైకోర్టు