YS Sharmila: రాహుల్ కు అభినందనలు తెలిపిన వైఎస్ షర్మిల

మోడీ ఇంటిపేరుపై ఉన్న వ్యక్తుల్ని అందర్నీ కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేసింది.

YS Sharmila: మోడీ ఇంటిపేరుపై ఉన్న వ్యక్తుల్ని అందర్నీ కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీని దోషీగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దీంతో మార్చ్ 24న రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. తాజాగా సుప్రీంకోర్టు రాహుల్ కేసుపై స్టే విధించింది. దీంతో రాహుల్ గాంధీ మళ్ళీ పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వైస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు.

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యునిగా తిరిగి నియమించబడటంతో షర్మిల సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె రాహుల్ కు అభినందనలు తెలిపింది.. మీ ధైర్యసాహసాలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలలో మళ్లీ ఆశలు చిగురింపజేస్తూనే ఉన్నారని కొనియాడారు. న్యాయం తన మార్గాన్ని అనుసరించి అందరూ సంతోషించే తీర్పు వెలువడిందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విపక్షాలందరు చేతులు కలాపాలని ఆమె సూచించింది. పార్లమెంటులో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి నా నైతిక మద్దతును కూడా తెలియజేస్తున్నాను అంటూ ప్రకటించారు.

షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆమెతో ప్రియాంక గాంధీ సంప్రదింపులు జరిపారని, అయితే తన పార్టీని విలీనం చేయాల్సిందిగా ప్రియాంక కోరినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే దానికి ఆమె నసేమీర అన్నట్టు సమాచారం. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు షర్మిలను ఏపీలో పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. నిజానికి షర్మిల తెలంగాణాలో పర్యటిస్తున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా ఇప్పటికే ఆమె ప్రకటించారు. అయితే షర్మిల మాత్రం కాంగ్రెస్ తో దోస్తీకి సిద్దమైనట్టే కనిపిస్తుంది. అఫీషియల్ గా కాకపోయినా అనఫీషియల్ కాంగ్రెస్ కు ఆమె మద్దతిస్తూనే ఉన్నారు.ఎప్పటికప్పుడు ఆ పార్టీని కొనియాడుతూనే కనిపిస్తున్నారు.

Also Read: IIT-H Student Suicide : ఐఐటీ హైదరాబాద్‌ లో స్టూడెంట్ సూసైడ్‌.. ఆ లెటర్ లో ఏముందంటే ?