Site icon HashtagU Telugu

Rave Parties: రేవ్ పార్టీల‌కు పాము విషం..త‌ప్పును అంగీక‌రించిన యూట్యూబ‌ర్ యాద‌వ్‌

Youtuber Elvish Yadav Admit

Youtuber Elvish Yadav Admit

 

Rave Parties: బిగ్ బాస్ ఓటీటీ విన్న‌ర్ ఎల్విష్ యాద‌వ్(Elvish Yadav) త‌న త‌ప్పును అంగీక‌రించాడు. రేవ్ పార్టీల‌కు(Rave Parties) పాముల‌తో పాటు పాము విషాన్ని(snake venom) ఆర్గ‌నైజ్ చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. పాము విషం దొరికిన కేసులో యూట్యూబ‌ర్(YouTuber) ఎల్విష్ యాద‌వ్‌ను ఆదివారం అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది పాము విషం స‌ర‌ఫ‌రా చేస్తూ దొరికిన వారితోనూ త‌న‌కు సంబంధాలు ఉన్న‌ట్లు యాద‌వ్ అంగీక‌రించాడు.

We’re now on WhatsApp. Click to Join.

26 ఏళ్ల ఎల్విష్ తొలుత స్నేక్ వినోమ్ కేసులో త‌న‌కు పాత్ర లేద‌ని చెప్పాడు. కానీ వేర్వేరు రేవ్ పార్టీల‌కు పాము విషాన్ని స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు అత‌ను ఒప్ప‌కున్నాడు. ఇత‌ర స‌ర‌ఫ‌రాదారుల‌తోనూ ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెప్పాడు. 14 రోజుల జుడిషియ‌ల్ క‌స్ట‌డీలోకి అత‌న్ని తీసుకున్నారు.

read also: Tamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

యాద‌వ్‌పై వైల్డ్‌లైఫ్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. నార్కోటిక్ డ్ర‌గ్స్‌, సైకోట్రాఫిక్ ప‌దార్ధాలు క‌లిగి ఉన్న కేసులో అత‌న్ని విచారిస్తున్నారు. సెక్ష‌న్ 29 కింద అత‌నికి క‌ఠిన శిక్ష విధించ‌నున్నారు. ఈ కేసులో బెయిల్ దొర‌క‌డం క‌ష్ట‌మే. వీడియో షూట్స్ కోసం ఎల్విష్ యాద‌వ్‌.. త‌న వ‌ద్ద ఉన్న పాముల‌ను వాడేవాడు. బాలీవుడ్ గాయ‌కుడు ఫ‌జిల్‌పురియా త‌న పార్టీల‌కు పాముల‌ను ఆర్గ‌నైజ్ చేసేవాడ‌ని గ‌తంలో ఎల్విష్‌యాద‌వ్ తెలిపాడు.

read also: Jagapathi Babu: జగపతిబాబు హీరో కాకపోయి ఉంటే ఆ ప్రొఫెషన్ లో ఉండేవారా?

ఇటీవ‌ల నోయిడాలోని జ‌రిగిన ఓ రేవ్ పార్టీలో పోలీసులు అయిదుగుర్ని అరెస్టు చేశారు. దాంట్లో న‌లుగురు పాములు ఆడించేవాళ్లు ఉన్నారు. 9 పాములతో పాటు స్నేక్ విషాన్ని కూడా సీజ్ చేశారు. ఓ ఎన్జీవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వాళ్ల‌ను ప‌ట్టుకున్నారు.