Site icon HashtagU Telugu

PM Modi: శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించేలా యువతను తయారుచేయాలి : ప్రధాని మోడీ

PM Rojgar Mela

Sanatana Dharmastra Left By Modi On The Opposition

PM Modi: భవిష్యత్ లో శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు యువతను తయారు చేయాలనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ యూనివర్సిటీ పరిధిలోకి ఎన్నో ప్రతిష్టాత్మకమైన కాలేజీలు వచ్చాయని, ఈ కళాశాలల్లో కొన్ని ఇప్పటికే గొప్ప వ్యక్తులను తయారుచేసిన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాయన్నారు. భారతిదాసన్ విశ్వవిద్యాలయం బలమైన,  పరిణతి చెందిన పునాదిపై ప్రారంభమైందని తెలిపారు.

కోవిడ్ -19 సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లను రవాణా చేయడంలో యువ శాస్త్రవేత్తలు గొప్ప పాత్ర పోషించారన్నారు.  చంద్రయాన్ వంటి మిషన్ల ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో చెరపరని ముద్ర వేశారని తెలిపారు. మన ఆవిష్కర్తలు పేటెంట్ల సంఖ్యను 2014లో 4వేలు ఉంటె,  ఇప్పుడు దాదాపు 50 వేల పేటెంట్లు ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు.

Also Read: Inavolu Jatara: ఐనవోలు మల్లన్న జాతరకు భారీ ఏర్పాట్లు, ఉగాది వరకు ఉత్సవాలు