PM Modi US Tour: మూడు రోజుల అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం బయలుదేరారు. అమెరికాలోని డెలావేర్‌లో జరిగే క్వాడ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య జరిగిన భేటీకి సంబంధించిన కన్వర్జేషన్ వైరల్ అవుతుంది. ఎందుకంటే గతంలో మోడీతో ఒబామా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నారు మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా.
అమెరికాలోని భారత రాయబారి మరియు మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా 2014లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి ఒక మరపురాని క్షణాన్ని పంచుకున్నారు. భారత ప్రధాని మోడీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (Obama) మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో చెప్పారు. మోదీ, బరాక్ ఒబామా మధ్య చర్చలు ముగిసిన తర్వాత ఒబామా కారులో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ మెమోరియల్‌కు వెళ్లినట్లు వినయ్ క్వాత్రా తెలిపారు. అప్పుడు ఆయన లాంగ్వేజ్ ట్రాన్స్ లేటర్ గా ఉన్నట్లు క్వాత్రా తెలిపారు. ఈ 10 నిమిషాల పర్యటనలో ఒబామా తన తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల గురించి ప్రధాని మోదీని అడిగారట. ఈ సమయంలో ఒబామా ప్రధాని మోదీని మీ అమ్మ ఎక్కడ నివసిస్తున్నారు అని అడిగారని, దానికి ప్రధాని మోదీ నవ్వుతూ, నేను చెప్పేది బహుశా మీరు నమ్మరని అన్నారు. మీ కారులోపల స్థలం అంత ఉంటుంది మా అమ్మ నివసించే ఇల్లు అని మోడీ ఒబామాతో అన్నారట.
మోడీ చెప్పిన మాటలకు ఒబామా ఆశ్చర్యపోయారని, ఎందుకంటే ఆ సమాధానంలో నిజం బయటపడిందని ఆయన అన్నారు. ఆ సమాధానం తర్వాత ఎక్కడో బరాక్ ఒబామా ప్రధాని మోదీ జీవితంలో తన సొంత కష్టాలను చూశారని తెలిపారు క్వాత్రా. వినయ్ మోహన్ క్వాత్రా ఇంకా మాట్లాడుతూ ఈ సంభాషణ తర్వాత ఒబామా మరియు మోడీ మధ్య లోతైన అవగాహన ఏర్పడిందన్నారు. ఎందుకంటే ఒబామా, మోడీ ఇద్దరూ వినయపూర్వకమైన పరిస్థితుల నుండి మరియు ఇలాంటి జీవిత పోరాటాల నుండి తమ దేశాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కాగా 2014లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన అప్పట్లో సంచలన టాపిక్ గా మారింది.
Also Read: KTR: సీఎం రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన కేటీఆర్