Site icon HashtagU Telugu

Stalin : ఇలాగే కొనసాగిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారు.. మోడీకి స్టాలిన్‌ హెచ్చరిక

222

You will end up isolated.. MK Stalin's warning to PM Modi after Union Budget

CM Stalin: పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ (Central budget)2024-25లో ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను విస్మరించారంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యలోనే బుధవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (CM Stalin)ఎక్స్‌ వేదికగా ప్రధాని మోడీ(PM Modi)కి త్రీవ హెచ్చరికలు చేశారు. పాలనపై దృష్టి సారించడం కంటే ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగిస్తే ఒంటరిగా మిగిలిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయాయని, ఇక దేశం గురించి ఆలోచించాలని హితబోధ చేశారు. ‘‘బడ్జెట్-2024 మీ పాలనను కాపాడుతుంది. కానీ దేశాన్ని రక్షించదు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడిపించండి లేదంటే మీరు ఒంటరి అయిపోతారు. మిమ్మల్ని ఓడించిన వారి విషయంలో ఇంకా ప్రతీకారానికి పోవద్దు. మీ రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపిస్తే ఒంటరిగా మిగులుతారు’’ అని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. కాగా, బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్‌లో ఈ రోజు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.  బడ్జెట్‌లో మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అందుకు నిరసనగా నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాబోం. పార్లమెంట్‌లో మా నిరసన తెలుపుతామని ఇప్పటికే సూచించారు.ఈ ఆందోళనల్లో భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను స్టాలిన్ షేర్ చేశారు.

Read Also: Chandipura and Dengue : చండీపురా వైరస్ – డెంగ్యూ లక్షణాల మధ్య తేడా ఏమిటి..?