Udhayanidhi: మీరోక మంత్రి..మాట‌ల ప‌ర్య‌వ‌సానాలు తెలిసి ఉండాలిః ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై సుప్రీంకోర్టు

  • Written By:
  • Updated On - March 4, 2024 / 03:19 PM IST

 

Udhayanidhi Stalin: త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin)స‌నాత‌న ధ‌ర్మం(Sanatana Dharma)పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ ఉద‌య‌నిధి పిటీష‌న్‌ను విచారించింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ కోర్టును ఎలా ఆశ్ర‌యిస్తున్నార‌ని సుప్రీం బెంచ్ తీవ్రంగా ప్ర‌శ్నించింది. మీరు మాట్లాడే మాట‌ల ప‌ర్యవ‌సానాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉండాల‌ని కోర్టు తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19(1) ప్ర‌కారం మీరు మీకు హ‌క్కును దుర్వినియోగం చేశార‌ని, ఆర్టిక‌ల్ 25 ప్ర‌కారం కూడా దుర్వినియోగం చేశార‌ని, కానీ ఇప్పుడు ఆర్టిక‌ల్ 32 ప్ర‌కారం మీరు సుప్రీంలో పిల్ దాఖ‌లు చేశార‌ని, మీరు మాట్లాడిన మాట‌ల ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా, మీరేమీ సాధార‌ణ వ్య‌క్తి కాదు అని, మీరు మంత్రి అని, మాట‌ల ప‌ర్య‌వ‌సానాలు తెలిసి ఉండాల‌ని సుప్రీం బెంచ్ తెలిపింది.

read also : WTC Points Table: డ‌బ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా..!

ఈ కేసును మార్చి 15వ తేదీకి వాయిదా వేశారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో స‌నాత‌నం ధ‌ర్మంపై స్టాలిన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సామాజిక న్యాయం, స‌మాన‌త్వానికి స‌నాత‌న ధ‌ర్మం వ్య‌తిరేకం అన్నారు. దాన్ని నిర్మూలించాల‌న్నారు. ఆ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు సీరియ‌స్ అయ్యారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో పోల్చారాయ‌న‌.