Site icon HashtagU Telugu

Akhilesh Yadav: `కాశీ`మ‌జిలీ.. ఎర్ర టోపీ వ‌ర్సెస్ బ‌నార‌స్.!

Mid Copy

Mid Copy

రెండు రోజుల ప్ర‌ధాని నరేంద్ర మోడీ వార‌ణాసి టూర్ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌ను సృష్టిస్తోంది. మోడీ కాశీ ప‌ర్య‌ట‌న‌ను జీవితంలో అంతిమ‌ రోజుల్లో చేసే `బ‌నార‌స్` యాత్ర మాదిరిగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ అభివ‌ర్ణించాడు. ఎస్పీ నేత‌లు పెట్టుకునే టోపీ క‌ల‌ర్ ఎరుపు రంగును మోడీ టార్గెట్ చేశాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు ఎస్పీ అపాయం అనే విష‌యాన్ని ఆ టోపీ ఎరుపు రంగు గుర్తు చేస్తోంద‌ని మోడీ విమ‌ర్శించ‌డం హాట్ టాపిక్ గా మారింది. అటు అఖిలేష్ ఇటు మోడీ ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో యూపీ రాజ‌కీయం వేడిక్కింది. గంగాన‌ది అప‌రిశుభ్ర‌త‌ను రాజ‌కీయ అస్త్రంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఉప‌యోగిస్తున్నాడు. కాశీ కారిడార్ ప్రారంభించ‌డానికి వ‌చ్చిన మోడీ గంగా న‌దిలోని లలిత్ ఘాట్ వ‌ద్ద మునిగాడు. కానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మున‌గ‌లేదు. ఆ నీళ్లు మురికిగా ఉన్నాయ‌ని యూపీ సీఎం యోగి మున‌గ‌లేద‌ని అఖిలేష్ విమ‌ర్శిస్తున్నాడు.

గంగా న‌ది శుద్ధి కోసం బీజేప ప్ర‌భుత్వం కొన్ని కోట్ల రూపాయాల‌ను ఖ‌ర్చు పెట్టింది. ఇంకా ఖ‌ర్చు పెడుతూనే ఉంది. కానీ, గంగ శుద్ధి ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది. ఆ విష‌యాన్ని అఖిలేష్ లేవ‌నెత్తాడు. గంగామాత ఎప్పుడైన శుభ్రంగా ఉంటుందా? అంటూ మీడియాను ప్ర‌శ్నించాడు. నిధుల ప్ర‌వాహం మాత్రం ఆగ‌డంలేదని, అప‌రిశుభ్రం అలాగే ఉంద‌ని ఆరోపించాడు. అందుకే, మోడీతో పాటు యూపీ సీఎం యోగి గంగ స్నానం చేయలేద‌ని ఎస్పీ చీఫ్ విమ‌ర్శ‌నాస్త్రాన్ని బ‌లంగా సంధించాడు.

వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల క్ర‌మంలో బీజేపీ, ఎస్పీ మధ్య మాట‌ల యుద్ధం రాజుకుంది. ప్ర‌జ‌లు చివ‌రి రోజుల్లో బ‌స చేసే ప్రదేశంగా బ‌నార‌స్ ను పోల్చాడు అఖిలేష్‌. ఇప్పుడు మోడీ ప‌ర్య‌ట‌న కూడా చివ‌రి రోజుల్లో ప్ర‌జ‌లు గ‌డిపే బ‌నార‌స్ త‌ర‌హాలో ఉంద‌ని ఎస్పీ చీఫ్ అంటున్నాడు. మొత్తం మీద అటు ఎరుపు టోపీ ఇటు బ‌నార‌స్ వ్యాఖ్య‌ల్లోని అంత‌రార్థం ఇప్పుడు యూపీలో రాజ‌కీయ హాట్ బీట్స్ అయ్యాయ‌న్న‌మాట‌.

Exit mobile version