Yogi Adityanath Oath: యూపీ సీఎంగా `యోగి` ప్ర‌మాణ‌స్వీకారం!

రెండోసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్ర‌మాణం స్వీకారం చేశాడు.

  • Written By:
  • Updated On - March 25, 2022 / 05:58 PM IST

రెండోసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్ర‌మాణం స్వీకారం చేశాడు. ఆయ‌న తో పాటు ఇద్ద‌రు ఉప ముఖ్యమంత్రిలుగా బ్రజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్ర‌మాణం చేయ‌డంతో పాటు మొత్తం 52 మంది మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌డం జరిగిది. కొత్త క్యాబినెట్ లో ఐదుగురు మ‌హిళల‌కు అవ‌కాశం ల‌భించింది. ప్ర‌ధాని మోడీ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసి ప‌రిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేల‌కు మంత్రులుగా అవ‌కాశం ల‌భించ‌డం యోగి క్యాబినెట్ లోని ప్ర‌త్యేక‌త‌. కేవ‌లం 37 ఏళ్ల యోగి ఆదిత్యానాథ్ రెండోసారి యూపీ సీఎంగా ప్ర‌మాణం చేసి రికార్ట్ సృష్టించాడు. పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న జ‌నం మ‌ధ్య ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం జ‌రిగింది. తొలుత శుక్ర‌వారం ఉదయం బిజెపి శాసనసభా పక్షం పార్టీ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్‌ను నాయకుడిగా ఎన్నుకుంది. ఆ తర్వాత గవర్నర్‌ను క‌లిసి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం అందించాడు.

ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, పారిశ్రామికవేత్తలు ఈ ప్ర‌మాణోత్స‌వానికి హాజ‌రు అయ్యారు. ప్ర‌ధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ త‌దిత‌ర బీజేపీ పెద్ద‌లు పాల్గొన్నారు. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులలో, పుష్కర్ సింగ్ ధామి, బసవరాజ్ బొమ్మైల హాజ‌ర‌య్యారు. ఎకానా స్టేడియంకు కిక్కిరిసి పోయింది. కాన్పూర్ దేహత్ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు యుపి ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ల‌లో భోగ్నిపూర్ నుండి రాకేష్ సచన్, సికంద్రా నుండి అజిత్ పాల్ మరియు అక్బర్‌పూర్ నుండి ప్రతిభా శుక్లా ఉన్నారు. ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి నుంచి దయాశంకర్ మిశ్రా దయాళు, రవీంద్ర జైస్వాల్‌లు స్వతంత్ర బాధ్యతలతో కూడిన రాష్ట్ర మంత్రులుగా, అనిల్ రాజ్‌భర్‌కు క్యాబినెట్ మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు.

క్యాబినెట్ మంత్రులు

సూర్య ప్రతాప్ షాహి, సురేష్ కుమార్ ఖన్నా, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీ నారాయణ్ చౌదరి, జయవీర్ సింగ్, ధరంపాల్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌భర్, జితిన్ ప్రసాద, రాకేస్క్ సచన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర యుపాధ్యా ఆశిష్ పటేల్, సంజయ్ నిషాద్

రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత)

నితిన్ అగర్వాల్, కపిల్ దేవ్ అగర్వాల్, రవీంద్ర జైస్వాల్, సందీప్ సింగ్, గులాబ్ దేవి, గిరీష్ చంద్ర యాదవ్, ధర్మవీర్ ప్రజాపతి, అసిమ్ అరుణ్, JPS రాథోడ్, దయాశంకర్ సింగ్, నరేంద్ర కశ్యప్, దినేష్ ప్రతాప్ సింగ్, అరుణ్ కుమార్ సక్సేనా, దయాశంకర్ మిశ్రా ‘దయాలు’

రాష్ట్ర మంత్రి

మయాంకేశ్వర్ సింగ్, దినేష్ ఖతీక్, సంజీవ్ గోండ్, బల్దేవ్ సింగ్ ఓలాఖ్, అజిత్ పాల్, జస్వంత్ సైనీ, రాంకేశ్ నిషాద్, మనోహర్ లాల్ మన్ను కోరి, సంజయ్ గంగ్వార్, బ్రిజేష్ సింగ్, KP సింగ్, సురేష్ రాహి, సోమేంద్ర తోమర్, అనూప్ ప్రధాన్ ‘వాల్మీకి’, ప్రతిభా స్హుక్ , రాకేష్ రాథోడ్ గురు, రజనీ శర్మ, సతీష్ శర్మ, డానిష్ ఆజాద్ అన్సారీ, విజయ్ లక్ష్మీ గౌతమ్

ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించారు. మరియు 1985 తర్వాత UPలో అధికారాన్ని నిలబెట్టుకున్న మొదటి పార్టీగా BJP అవతరించింది. ఆదిత్యనాథ్ నియామకాన్ని ధృవీకరించిన BJP లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి మిత్రపక్షాలైన అప్నా దళ్ (సోనేలాల్) , నిషాద్ పార్టీ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా హాజరయ్యారు. .

ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 403 స్థానాలకు గానూ 273 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి 255 సీట్లు రాగా, దాని మిత్రపక్షాలైన నిషాద్ పార్టీ, అప్నా దళ్ (ఎస్) 18 స్థానాలను కైవసం చేసుకున్నాయి. గట్టి పోటీగా భావించిన ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి కేవలం 125 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఈసారి సీఎంగా ఆదిత్యనాథ్ నియామకం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, బిజెపి పెద్దలు గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆదిత్యనాథ్-నరేంద్ర మోదీ ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వ విజయాన్ని ప్రశంసించారు. సిఎం మోడీ తన భుజాలపై చేయి ఉంచిన చిత్రాన్ని ట్వీట్ చేశారు.

2024లో కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే ఆదిత్యనాథ్ 2022లో తిరిగి సీఎం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో, సన్యాసి-రాజకీయవేత్త సంస్థలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. .

కొంతమంది పరిశీలకులు రాబోయే సంవత్సరాల్లో బిజెపికి మరింత పెద్ద పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు, అయినప్పటికీ ఆదిత్యనాథ్ తన మొదటి పదవీకాలంలో మోడీ , షాల ‘మార్గదర్శకత్వం’ కోసం కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు.