Ramdev Baba controversy : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న రాందేవ్ బాబా వ్యాఖ్యలు..!!

మహిళలపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలు రాందేవ్ బాబాను టార్గెట్ చేస్తూ తీవ్రవిమర్శలు చేస్తున్నాయి. దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని థానేలో జరిగిన యోగా శిబిరంలో రాం దేవ్ బాబా మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సతీమని కూడా పాల్గొన్నారు. బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ , […]

Published By: HashtagU Telugu Desk
Ramdev Baba

Ramdev Baba

మహిళలపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలు రాందేవ్ బాబాను టార్గెట్ చేస్తూ తీవ్రవిమర్శలు చేస్తున్నాయి. దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని థానేలో జరిగిన యోగా శిబిరంలో రాం దేవ్ బాబా మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సతీమని కూడా పాల్గొన్నారు.

బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ , టీఎంసీతోపాటు ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కూడా రాందేవ్ బాబా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. రాందేవ్ బాబా వీడియోను షేర్ చేస్తూ …మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి భార్య ముందు మహిళలపై చేసిన వ్యాఖ్యలు చాలా అసభ్యకమైనవి..ఖండించదగ్గవి.

ఈ ప్రకటన వల్ల మహిళాలోకం తీవ్ర మనస్థాపానికి గురైంది. రాందేవ్ బాబా వెంటనే దేశానికి క్షమాపణ చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు. రాందేవ్ బాబా ప్రకటనపై ఏపీలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహారాష్ట్రలో మహిళా కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేపట్టారు. రాందేవ్ బాబా క్షమాపణ చెప్పకుంటే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరించారు.

  Last Updated: 27 Nov 2022, 10:07 AM IST